Read more!

English | Telugu

సినిమా పేరు:బ్రోకర్
బ్యానర్:డైరెక్టర్స్ సినిమా
Rating:2.75
విడుదలయిన తేది:Dec 31, 2010
మన దేశంలో లంచగొండితనం ఎంత బలంగా పాతుకుపోయిందో,మీడియేటర్లు అదేనండీ బ్రోకర్లు లేకుండా ఏ పనీ కాని పరిస్థితి ఎందుకొచ్చిందో చూపించే చిత్రం ఈ "బ్రోకర్".గణపతి అనే బ్రోకర్(ఆర్.పి.పట్నాయక్)కిరాజకీయనాయకులతో, ప్రభుత్వాధికారులతో మంచి పరిచయాలుంటాయి.ఈ పరిచయాలనుపయోగించుకుంటూ ఒక బ్రోకర్ గా అందరి దగ్గరా కమీషన్లు తీసుకుంటూ,అందరికీ పనులు చేసి పెడుతూంటాడు.ఆ పనులు లీగలా లేక ఇల్లీగలా అనేది గణపతి చూడడు.తన కమీషన్ తనకు వచ్చిందా లేదా అన్నదే అతనికి ముఖ్యం .అతను చేసే ఈ బ్రోకర్ పనివల్ల ఒక ఫ్లై ఓవర్ కూలుతుంది.స్వయంగా అతని కొడుకు చనిపోయినా పట్టించుకోడు.భార్య అతన్ని వదిలేసిపోతుంది.అయినా గణపతి మారడు.కానీ ధర్మతేజ(శ్రీహరి)అనే ఒక ఆఫీసర్ మూలంగా గణపతి మారతాడు.అలా మారిన గణపతి తాను చేసిన తప్పుల్ని ఎలా సవరించుకున్నాదన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
దర్శకత్వం -గతంలో"అందమైన మనసులో"అనే చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్.పి.పట్నాయక్ కి దర్శకత్వం మీద మంచిపట్టేఉందని చెప్పాలి.దర్శకుడిగా "బ్రోకర్"అతనికి రెండవ చిత్రం.ఈ చిత్రం యొక్క స్క్రీన్ ప్లే ఇంకా పట్టుగా ఉండుంటే సినిమా ఇంకా బాగుండేది.ఈ సినిమా తొలి సగం కాస్త స్లోగా ఉన్నట్టనిపించినా,పోను పోను ప్రేక్షకుణ్ణి కథలోకి లాక్కుంటుంది.చివరి అరగంట మాత్రం చాలా బాగుంది.నిర్మాణపు విలువలు బాగున్నాయి. నటన - ఆర్.పి.పట్నాయక్ నటుడిగా "శ్రీను,వాసంతి,లక్ష్మి"చిత్రంలో అంధ గాయకుడిగా నటించి తానేంటో నిరూపించుకున్నాడు.అతనిలోని నటుడి గురించి ఈ రోజు కొత్తగా ఏం రాయక్కలేదు.ఈ సినిమాలో కూడా అతను చక్కని నటన కనపరిచాడు.ఇక మయూరి,అర్చన,కీర్తి చావ్లా అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.రియల్ స్టార్ శ్రీహరి పాత్ర సినిమాకి చాలా ఊతాన్నిచ్చింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ పెద్దగా నవ్వించలేకపోయింది. సంగీతం - తన దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఆర్.పి.పట్నాయక్ ఉన్నంతలో మంచి సంగీతాన్నే అందించాడు.పాటలన్నీ బాగానే ఉన్నాయి.అలాగే రీ-రికార్డింగ్ కూడా గుంది. సినిమాటోగ్రఫీ - ఈ చిత్రంలో కేమెరా పనితనం బాగుంది.శరత్ ఫొటోగ్రఫీ కళ్ళకి ఇబ్బందిలేని విధంగా చూడచక్కగా ఉంది. మాటలు - అత్యంత అనుభవజ్ఞుడైన రచయిత యమ్.వి.యస్.హరనాథరావు అర్థవంతమైన మాటలతో అలరించాడు. పాటలు - చైతన్య ప్రసాద్‍ పాతల్లో సాహిత్యం బాగుంది. ఎడిటింగ్ - ఉద్ధవ్ ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ - కళాదర్శకత్వం ఫరవాలేదు. కొరియోగ్రఫీ - రఘు కొరియోగ్రఫీ బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమాలో ద్వందర్థాల మాటలు,పాటలూ,అసభ్య,అశ్లీల దృశ్యాలూ,స్టెప్పులు,యాక్షన్ సన్నివేశాలూ,హీరో దెబ్బకొడితే దెబ్బకి పదిమంది గాల్లోకి ఎగుతూ పడిపోవటాలు లేవు.కానీ ఒక మంచి సందేశం ఉంది.మంచి సినిమాలు రావటం లేదంటూ గోలపెట్టే ఓ ప్రేక్షకులూ ఇదోక సదాశయంతో తీసిన చిత్రం.మన దేశంలోని ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగానో,లేక పరోక్షంగానో ఈ బ్రోకర్ల బారిన,ఈ లంచగొండితనం బారినపడుతునే ఉన్నాం.అలాంటి వాటి గురించి ఎండగడుతూ తీసిన,ఇలాంటి ఆలోచింపజేసే మంచి చిత్రాన్ని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వచ్చేందుకుఆస్కారం ఉంటుంది.ఆ తర్వాత మీ ఇష్టం