English | Telugu

బ్రహ్మ ఆనందం
సినిమా పేరు:బ్రహ్మ ఆనందం
బ్యానర్:స్వధారం ఎంటర్‌టైన్‌మెంట్
Rating:2.50
విడుదలయిన తేది:Feb 14, 2025

సినిమా పేరు: బ్రహ్మా ఆనందం
నటీనటులు:బ్రహ్మానందం,రాజా గౌతమ్, సంపత్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని,ప్రభాకర్,దివిజ ప్రభాకర్,తాళ్లూరి రాజేశ్వరి  తదితరులు 
రచన,దర్శకత్వం: ఆర్.వి.ఎస్.నిఖిల్
సినిమాటోగ్రఫి: మితేష్ పర్వతనేని
ఎడిటర్: ప్రణీత్ కుమార్ 
సంగీతం: శాండిల్య పీసపాటి 
నిర్మాత:రాహుల్ యాదవ్ నక్కా
బ్యానర్ :స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్    
రిలీజ్ డేట్ 14 -01 -2025 

చాలా ఏళ్ళ తర్వాత స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ముఖ్య పాత్రలో,ఆయన కుమారుడు రాజా గౌతమ్ హీరోగా,ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ'బ్రహ్మ ఆనందం'(Brahma anandam) మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
బ్రహ్మ(రాజా గౌతమ్),థియేటర్ ఆర్టిస్ట్ గా తనకి ఇష్టమైన నటనా రంగంలో కొనసాగుతు సినిమాల్లో అవకాశాలు కోసం ట్రై చేస్తుంటాడు.పక్కా సెల్ఫిష్ గా ఆలోచించే బ్రహ్మ తనని ఇష్టపడుతున్న తార (ప్రియా) అనే అమ్మాయి ఇచ్చే డబ్బులు కోసం,ఆమెని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతు ఉంటాడు.తార మాత్రం బ్రహ్మని ప్రేమిస్తూ ఉంటుంది.ఈ విషయం మొత్తం బ్రహ్మ స్నేహితుడు గిరి(వెన్నెల కిషోర్) కి తెలుసు.బ్రహ్మ తాత ఆనంద రామకృష్ణ(బ్రహ్మానందం) హోల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు.బ్రహ్మ కి కొంత డబ్బు అవసరం అవుతుంది.ఆ డబ్బులు తన పొలం అమ్మి ఇస్తానని బ్రహ్మానందాన్ని, ఆనంద రామకృష ఒక విలేజ్ కి తీసుకెళ్తాడు.కానీ ఆ ఊరులో పొలం ఉండదు.అసలు ఆ ఊరు కూడా ఆనంద రామకృష్ణది కాదు. గిరి వాళ్ళ ఊరు.మరి బ్రహ్మ కి ఎందుకు అబద్ధం చెప్పి ఆనంద రామకృష్ణ ఊరు తీసుకెళ్లాడు? బ్రహ్మ కి డబ్బులు అవసరం ఎందుకు వచ్చాయి? తార పరిస్థితి ఏంటి? రాజా ఆర్టిస్ట్ లక్ష్యం నెరవేరిందా? అసలు ఆనంద రామకృష్ణ కథ ఏంటి? అనేదే ఈ కథ


ఎనాలసిస్ :

కథ గా చెప్పుకుంటే ఇది ముమ్మాటికీ మంచి కథే. పైగా ఈ రోజులో అందరకి తెలియాల్సిన కథ. కాకపోతే కథనాల్లోని లోపాలతో పాటు,టేకింగ్ లోని లోపాలు,సరైన బడ్జెట్ లేకపోవడం వల్ల సినిమా ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవ్వదు.ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే సినిమా ప్రారంభమైన దగ్గరనుంచి,మొదటి పది నిముషాలు కొత్తగా అనిపిస్తుంది.ఇక అక్కడ్నుంచి మొత్తం మూడు క్యారక్టర్ లతో ఇంటర్వెల్ వరకు సినిమా నడుస్తుంది.సినిమా నటుడు కావాలనే  బ్రహ్మ లక్ష్యాన్ని ఫస్ట్ ఆఫ్ లో మరింతగా చూపించాల్సింది.బ్రహ్మ,తార పరిచయ సన్నివేశాలని కూడా చేప్పి ఉంటే ప్రేక్షకుడికి రిలీఫ్ గా ఉండాల్సింది. అలా కాకుండా ఎంతసేపు బ్రహ్మ, గిరి,ఆనంద రామకృష్ణ వైపే సీన్స్ ని ఎస్టాబ్లిష్ చేసారు.ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగుంది. ఇక సెకండ్ ఆఫ్ లో కూడా ఆ ట్విస్ట్ కి తగట్టుగా సన్నివేశాలని రాసుకొని ఒక ఫామిలీ డ్రామా గా చూపించాల్సింది. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ లో పాయింట్ నే కొన్ని కొన్ని సీన్స్ లో రన్ చేసి, ప్రేక్షకుడికి కొత్త దనం అనేది లేకుండా చేసారు.కాకపోతే సంపత్ క్యారక్టర్ ని డిజైన్ చేసిన విధానం కొంత రిలీఫ్ ఇస్తుంది. దర్శకుడు అనుకున్న పాయింట్ కి సంపత్ ని ఇంకొంచం ముందుగానే ఎంటర్ చేసి, బ్రహ్మ, సంపత్ కలిసి ఆనంద రామకృష్ణ ని ఎలా గెలిపించారనేది చెప్పి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయ్యేది.అలా కాకుండా ముఖ్యమైన విషయాలన్నింటిని ఒక్క సీన్ లో తేల్చి పడేసారు. రాజా తన క్యారక్టర్ మార్చుకునే తీరుని ఒక్కసారిగా కాకుండా, కొంచం లెన్త్ గా చూపించాల్సింది.హీరోయిన్ ని కూడా రాజా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా  చూపించాల్సింది. డైలాగులు అక్కడక్కడ మాత్రం బాగా పేలాయి.ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ ఆఫ్ కొంచం బెటర్ అనేలా సాగింది 

నటీ నటులు, సాంకేతిక నిపుణుల పని తీరు 
రాజా గౌతమ్(Raja Gowtham)తన బ్రహ్మ క్యారక్టర్ లో చాలా చక్కగా నటించాడు.మంచి అవకాశాలు వస్తే  తెలుగు చిత్ర సీమకి ఇంకో మంచి హీరో దొరికినట్లే.బ్రహ్మానందం(Brahmanandham)గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు.ఆనంద రామకృష్ణ క్యారక్టర్ లో ప్రేక్షకులని తన మ్యానరిజమ్స్ తో మరోసారి కట్టిపడేసాడు.ఒక రకంగా బ్రమ్మీ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు.వెన్నెల కిషోర్ కూడ ఎప్పటిలాగానే తన కామెడితో నవ్వులు పూయించాడు.మిగతా క్యారెక్టర్లలో చేసిన సంపత్,రాజీవ్ కనకాల,ప్రభాకర్,దివిజ ప్రభాకర్ కూడ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. హీరోయిన్ గా చేసిన ప్రియా కొన్ని సీన్స్ లోనే అయినా తన క్యారక్టర్ కి పూర్తి న్యాయం చేసింది.దర్శకుడు విషయానికి వస్తే టేకింగ్ ఏ మాత్రం బాగోలేదు. ప్రేక్షకులకి సినిమా చూస్తున్న ఫీలింగ్ కాకుండా షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ ని కలిగించాడు.షాట్ డివిజన్ కూడా బాగోలేదు. నిర్మాణ విలువలు కూడా అసలు బాగోలేదు.కెమెరా అండ్ మ్యూజిక్ కూడా సో సో గానే నడిచాయి


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కథ తో పాటు నటీనటుల పెర్ఫార్మెన్సు  బాగానే ఉన్నా కూడా దర్శకత్వ పని తీరు, నిర్మాణ విలువల వల్ల ప్రేక్షకులకి బ్రహ్మ ఆనందం అంతగా రుచించకపోవచ్చు                                                                                                                                    

- అరుణాచలం