Read more!

English | Telugu

సినిమా పేరు:బాడీ గార్డ్
బ్యానర్:శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్
Rating:2.75
విడుదలయిన తేది:Jan 14, 2012

కథ - అన్యాయాన్ని ఎదిరించే వెంకటాద్రి (వెంకటేష్) ఆవేశాన్ని అదుపుచేసి, అతన్ని ఒక ప్రయోజకుడిగా చేయాలనే ఉద్దేశంతో, వెంకటాద్రి దేవుడిలా భావించే వరదరాజులు (ప్రకాష్ రాజ్) వద్దకు "బాడీ గార్డ్" గా పంపిస్తాడు అతని మేనమామ (తనికెళ్ళ భరణి). అక్కడ వరదరాజులు కూతురు కీర్తి (త్రిష) కి బాడీ గార్డ్ గా సిటీకి వస్తాడు వెంకటాద్రి. కీర్తితో పాటు ఆమె ఫ్రెండ్ స్వాతి ( సలోని), ఇద్దరు పనివాళ్ళు కూడా ఉంటారు. వెంకటాద్రిని ఆటపట్టించటానికి కీర్తి ఫోన్ లో తాను వేరే అమ్మాయిగా పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానంటుంది. ఆ సందర్భంగా వెంకటాద్రితో కీర్తి గురించి చులకనగా మాట్లాడితే, దానికి వెంకటాద్రి రియాక్షన్ విన్న కీర్తి అనుకోకుండా వెంకటాద్రిని ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏమయింది...? కీర్తి తాను ప్రేమిస్తున్నట్లు వెంకటాద్రికి నిజం చెపుతుందా...? ఈ ప్రశ్నలకు సమాధానం వెండితెర మీద చూడాలి.


ఎనాలసిస్ :

విశ్లేషణ - దర్శకుడిగా మలినేని గోపీచంద్ తొలిసినిమా మంచి హిట్టిచ్చాడు. ఇది అతనికి మలి సినిమా. అతను పెద్దగా కష్టపడాల్సిందేం లేదు. ఇప్పటికే మూడు భాషల్లో ఘనవిజయం సాధించిన సినిమాని తెలుగులో తీయటం వల్ల దర్శకుడు ఈ సినిమాలో పెద్దగా క్రియేట్ చేయాల్సిందేం లేదు. ఉన్నదాన్ని చెడగొట్టకుండా, దాన్ని మననేటివిటీకి సరిపోయేలా చేశాడు దర్శకుడు గోపీచంద్. స్క్రీన్ ప్లే బాగుంది. సెంటిమెంట్ సీన్లు బాగానే వర్కవుటయ్యాయి. నిర్మాణపు విలువలు కూడా బాగున్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నటన - వెంకటేష్ ఇలాంటి రీమేక్ సినిమాలు చాలా వాటిలో నటించిన అనుభవముంది. అందువల్ల ఆయనకిది నల్లేరు మీది నడక. ఇక త్రిష కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సలోనీ, ప్రకాష్ రాజ్, అతులిత్, ఆలీ, ప్రగతి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


సంగీతం - ఫరవాలేదు. గొప్పగా లేకపోయినా చెత్తగా మాత్రం లేదు. రీ-రికార్డింగ్ కూడా బాగుంది.


సినిమాటోగ్రఫీ - పాటల్లో, యాక్షన్ సీన్లలో సినిమాటోగ్రఫీ బాగుంది.


మాటలు - ఫరవాలేదు. సగటు స్థాయిలో ఉన్నాయి.


పాటలు - చెప్పుకోతగ్గ స్థాయిలో ఈ చిత్రంలో గుర్తుంచుకోతగ్గ పాటలేం లేవు.


ఎడిటింగ్ - సగటు స్థాయిలోనే ఉంది.


ఆర్ట్ - బాగుంది.


కొరియోగ్రఫీ - ఫరవాలేదనిపించేలా ఈ చిత్రంలోని కొరియోగ్రఫీ ఉంది.


యాక్షన్ - సూపర్ గా ఉంది. మాస్ ప్రేక్షకుకులు ఈలలు వేసేలా, వెంకటేష్ అభిమానులకు ఆనందం కలిగించేలా ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు ఉన్నాయి.


ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కీ, స్త్రీలకూ బాగా నచ్చే సినిమా అవుతుంది. ఫరవాలేదు ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.