English | Telugu

సినిమా పేరు:బ్లఫ్ మాస్టర్
బ్యానర్:అభిషేక్ బచ్చ్చం , శ్రీదేవి మూవీస్
Rating:2.50
విడుదలయిన తేది:Dec 28, 2018

నటీనటులు: సత్యదేవ్, నందితా శ్వేత, 30 ఇయర్స్ పృథ్వీ, ఆదిత్య మీనన్, షిజ్జు, చైతన్య, వంశీ తదితరులు
నిర్మాణ సంస్థ: అభిషేక్ ఫిలిమ్స్
కెమెరా: దాశరధి శివేంద్ర
డైలాగ్స్: పులగం చిన్నరాయణ, గోపి గణేష్
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాత‌: రమేష్ పి పిళ్ళై
చిత్ర సమర్పణ: శివలెంక కృష్ణప్రసాద్
ద‌ర్శ‌క‌త్వం: గోపి గణేష్ పట్టాభి
విడుదల తేదీ: డిసెంబర్ 28, 2018

వరుణ్ తేజ్ తొలి సినిమా 'ముకుంద'లో సత్యదేవ్ చిన్న పాత్రలో మెరిశాడు. అదే వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా సినిమా 'అంతరిక్షం'లో డ్యూయల్ రోల్ చేశాడు. 'ముకుంద'తో పాటు అంతకు ముందు చేసిన సినిమాలకు 'అంతరిక్షం' సినిమాకూ మధ్య నటుడిగా సత్యదేవ్ చాలా ఎదిగాడు. 'అసుర', 'జ్యోతిలక్ష్మి', 'క్షణం', 'మన ఊరి రామాయణం', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'ఘాజీ' తదితర సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు హీరోగా నటించిన తాజా సినిమా 'బ్లఫ్ మాస్టర్'. తమిళ హిట్ 'సతురంగ వేట్టై'కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

క‌థ‌:
చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) సమాజంపై, మనుషులపై  ద్వేషాన్ని పెంచుకుంటాడు. డబ్బు లేకపోవడం వల్లే తన తల్లిదండ్రులు మరణించారని, ఈ సమాజంలో బతకాలంటే డబ్బు కావాలని ఓ నిర్ణయానికి వస్తాడు. డబ్బు కోసం మనుషులను మోసం చేయడాన్ని తన వృత్తిగా మార్చుకుంటాడు. ఉత్తమ్ కుమార్, ఆకాష్... ఇలా రకరకాల పేర్లతో వివిధ రకాలుగా మనుషులను మోసం చేస్తుంటాడు. డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతుంటాడు. ఈ మోసగాడికి మోసం అంటే ఏమిటో తెలియని అమ్మాయి అవని (నందితా శ్వేత) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అవని ప్రేమతో, అవని పరిచయంతో అప్పటివరకూ మోసాలు చేస్తూ బతికిన ఉత్తమ్ కుమార్... నిజంగా ఉత్తముడిగా, మంచివాడిగా ఎలా మారాడు? మంచివాడిగా మారిన ఉత్తమ్ కుమార్ కు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది సినిమా.  


ఎనాలసిస్ :

తమిళ సినిమా కథలో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పలు, చేర్పులు చేయడంలో దర్శకుడు గోపీ గణేష్ సక్సెస్ అయ్యాడు. అయితే... కథను కొత్తగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు. తమిళ సినిమా 'సతురంగ వేట్టై' 2014లో వచ్చింది. అప్పట్లో వార్తల్లో నిలిచిన మోసాలను ఆధారంగా చేసుకుని సినిమా తీశారు. అప్పటికీ... ఇప్పటికీ... ప్రజలు మోసపోవడంలో మార్పేమీ లేదు. అయితే... మోసగాళ్ల ప్రతిసారీ ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త పద్దతులను ఎంచుకుంటున్నారు. మోసగాళ్ల నయా పద్దతులను దర్శకుడు ఎక్కువ చూపిస్తే బావుండేది. తమిళ సినిమాలో సన్నివేశాలను చాలావారకూ తెలుగులో తెరకెక్కించాడు. తమిళ సినిమా చూడనివారికి సినిమా నచ్చే అవకాశాలు వున్నాయి. చూసినవారిని అంతగా మెప్పించకపోవచ్చు. దర్శకుడిగా నటీనటుల నుంచి చక్కటి నటన రాబట్టుకోవడంలో గోపి గణేష్ విజయం సాధించాడు. అలాగే, సినిమా డైలాగులు బావున్నాయి. సన్నివేశాలకు డైలాగులు బలాన్ని ఇచ్చాయి. అయితే.. కథనం చాలా నెమ్మదిగా సాగింది. అందువల్ల, కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు బావున్నాయి. కథకు తగ్గట్టు చక్కటి పాటలు ఇచ్చాడు. నేపథ్య సంగీతం కూడా బావుంది. నిర్మాణ విలువలు, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్:


సత్యదేవ్ నటన
సంభాషణలు
సునీల్ కశ్యప్ సంగీతం

మైనస్ పాయింట్స్:


కథ, కథలో కొత్తదనం లోపించడం
కథనం నెమ్మదిగా సాగడం

నటీనటుల పనితీరు:
నటుడిగా సత్యదేవ్ మరోసారి మెరిశాడు. తను ఎటువంటి పాత్రలోనైనా నటించగలనని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. మోసగాడిగా పలు సన్నివేశాల్లో ఎంత అవలీలగా నటించాడో... ద్వితీయార్థంలో బావోద్వేగభరితంగా, పతాక సన్నివేశాల్లో అంతే అద్భుతంగా ప్రేక్షకులు ఆలోచించేలా నటించాడు. వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ సత్యదేవ్ ప్లస్ పాయింట్స్. అతడు డైలాగులు చెప్పే తీరుకు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయం. నందితా శ్వేత పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ ఆకట్టుకుంటుంది. గర్భవతిగా నటించిన ఆమె సాహసాన్ని మెచ్చుకోవాలి. పృథ్వీ, ఆదిత్యా మీనన్, చైతన్యతో పాటు మిగతావారు పాత్రలకు తగ్గట్టు నటించారు.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నటీనటుల పరంగా, బడ్జెట్ పరంగా 'బ్లఫ్ మాస్టర్' చిన్న సినిమాయే. అయితే.. ప్రేక్షకులను చిన్నబుచ్చే సినిమా కాదు. తన నటనతో సత్యదేవ్, సంగీతంతో సునీల్ కశ్యప్, డైలాగులతో దర్శక రచయితలు గోపి గణేష్, పులగం చిన్నరాయణ ప్రేక్షకులను మెప్పిస్తారు. సినిమా సూపర్బ్ అనే స్థాయిలో లేకున్నా... అందర్నీ ఆకట్టుకుంటుంది.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25