Read more!

English | Telugu

సినిమా పేరు:బెజవాడ రౌడీలు
బ్యానర్:నందిత కోనేరు ప్రెసెంత్స్
Rating:1.50
విడుదలయిన తేది:Dec 1, 2011

కథ - చెప్పుకోతగ్గ కథేం కాదు. విజయ్ కృష్ణ (ముకుల్ దేవ్), జయకృష్ణ (అజయ్), శివకృష్ణ (నాగచైతన్య) ముగ్గురూ అన్నదమ్ములు. కాళీ (ప్రభు) అనే రౌడీ అతని వద్ద విజయ్ కృష్ణ పనిచేస్తూంటాడు. అతని కోసం హత్యలు చేస్తూంటాడు. కాళీ తమ్ముడు శంకర్ (అభిమన్యు సింగ్) కి విజయ్ కృష్ణ అంటే పడదు. జయకృష్ణ పెళ్ళికి వచ్చిన కాళీని కిరాయి మనుషులతో హత్యచేయిస్తాడు శంకర్. ఆ తర్వాత విజయ్ కృష్ణని కూడా హత్య చేయిస్తాడు. అన్న మరణంతో శివకృష్ణ శంకర్ మీద పగబట్టి అతన్ని చంపటంతో ఈ సినిమా పూర్తవుతుంది.


ఎనాలసిస్ :

విశ్లేషణ - కథలో ప్రేక్షకులనాకట్టుకునే దమ్ములేదు. కథనం కూడా చాలా బలహీనంగా ఉండబట్టే వంగవీటి, దేవినేని వర్గాల మధ్య జరిగిన నేపథ్యంతో తయారైన కథ అన్న పుకారు పుట్టించి ఈ సినిమాకి ఓపెనింగ్స్ రాబట్టాలన్న ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఆ గొడవలేం ఈ సినిమాలో లేవు. దర్శకత్వం గొప్పగా ఏం లేదు. ఈ సినిమా నిండా హత్యలు, హింస, రక్తపాతం తప్ప ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం లేకపోవటంతో పిల్లలు, మహిళా ప్రేక్షకులకు ఈ సినిమా దూరమవుతుంది. ఇక నటన విషయానికొస్తే నాగచైతన్య ఇలాంటి సినిమాల్లో నటించకపోవటమే మంచిది. అతని నటన బ్యాలన్స్డ్ గా ఉన్నా భాష పలికే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే "శివ" సినిమాతో దీన్ని కచ్చితంగా పోల్చుకుంటారు ప్రేక్షకులు. "శివ"ఎంత గొప్ప హిట్టో ఈ సినిమా అంతగొప్ప ఫ్లాప్ గా నిలుస్తుంది.

సంగీతం - బతకని బిడ్డ బారెడన్నట్టు ఆకట్టుకోని సంగీతానికి 5 గురు తెలుగు భాష రాని సంగీత దర్శకులు ఈ చిత్రానికి పనిచేశారు. "బెజవాడ" అన్న టైటిల్ సాంగ్ తప్ప మిగిలిన పాటలేవీ వినసొంపుగా లేవు. రీ-రికార్డింగ్ కూడా శబ్దకాలుష్యంగా ఉంది.

కెమెరా - ఫరవాలేదు. యావరేజ్ స్థాయిలో ఉంది.

మాటలు - గొప్పగా ఏం లేవు. పాటలు - సిరాశ్రీ రాసిన "బెజవాడ" టైటిల్ సాంగ్ తప్ప మిగిలినవి పెద్దగా ఆకట్టుకోవు.

ఎడిటింగ్ - బాగుంది.

ఆర్ట్ - ఫరవాలేదు.

కొరియోగ్రఫీ - ఇదీ యావరేజ్ గానే ఉంది.

యాక్షన్ - అయిదుగురు ఫైట్ మాస్టర్లు ఈ సినిమాకి ఏం చేశారో అర్థం కాదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ సినిమా చూస్తే తలనొప్పి తెచ్చుకోవటం మినహా మీకేం మిగలదు.