Read more!

English | Telugu

సినిమా పేరు:అవతార్
బ్యానర్:ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్
Rating:3.75
విడుదలయిన తేది:Dec 18, 2009
భవిష్యత్‌లో జరగబోయే ఒక ఉహాజనితమైన సంఘటనకు ఆధారం చేసుకుని ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్‌ కెమరాన్‌ అత్యంత అద్భుతంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం "అవతార్‌''. కేవలం పేరులో మన భారతీయ ఇతిహాసాలకు సంబంధించిన ఒక పాత్రను ఆధారంగా తీసుకొని నిర్మించిన ఈ చిత్ర కథ విషయానికి వస్తే.... పండోర గ్రహంలోని అత్యంత విలువైన ఒక ఖనిజం 'అన్ అబ్టేనియం' ను సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఒక ప్రాజెక్ట్‌ను మానవులు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈ ఖనిజం వున్న ప్రదేశం పండేర వాసుల అధీనంలో వుంటుంది. జేక్‌ (కథానాయకుడు ) ఒక ఎక్స్ మెరైన్, అతడు ఈ పండేర వాసులతో స్నేహం చేయడానికి నియమింపబడ తాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా శాస్త్రవేత్తలు పండోర గ్రహంలో జీవించే ప్రాణిని సృష్టిస్తారు. ఈ సృష్టించబడిన జీవి పేరే "అవతార్‌''. ఈ ప్రాజెక్టులో పనిచేసే వారిలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవతార్ ను తయారు చేస్తారు.
ఎనాలసిస్ :
ఒక విధంగా ఇది మన జానపదాల్లోని పరకాయ ప్రవేశం వంటిది అని చెప్పుకోవచ్చు. ఈ అవతార్ రూపం ద్వారా పండోర గ్రహంలో వుండే జీవులతో కలిసిపోయి, అపురూప ఖనిజం వున్న ప్రదేశం పై దాడి చేయడం ప్రాజెక్టు ముఖ్యవుద్దేశం. కాగా జేక్ ఆ గ్రహంలోకి వెళ్ళాక అక్కడ యువరాణి స్నేహంతో పాటు ఆ గ్రహవాసుల అధరణతో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోవడంతో ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆర్మీతో ఘర్షణ ప్రారంభమవుతుంది. ఇంతకి హీరో తన ఆలోచన ఎందుకు మార్చుకున్నాడు... మానవులు ప్రారంభించిన ప్రాజెక్ట్‌ పూర్తి చేశారా.. లేదా... అని మీకు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.టైటానిక్‌ సినిమాతో ఒక మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించి ప్రపంచ సినీ అభిమానుల మనసులు దోచుకున్న దర్శకుడు జేమ్స్‌ కెమరాన్‌ సృష్టించిన మరో అద్భుత సృష్టి ఈ అవతార్‌. అత్యంత భారీ బడ్జెట్‌తో చాలా కాలంగా షూటింగ్‌ జరుపుకున్న అవతార్‌ సినిమా చరిత్రలోనే ఓ వండర్‌ చిత్రంగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జేమ్స్‌ కెమరాన్‌ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చర్చించాలి. అవతార్‌ చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌ని ఆయన అత్యద్భుతంగా చిత్రీకరించారు. అద్భుతమయిన కథకి పటిష్టమయిన స్క్రీన్‌ప్లే జోడించి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులని మరో లోకంలోకి తీసుకువెళుతుంది. ఒక వైపు పోరాటాలు, మరో వైపు సున్నితమయిన ప్రేమని, మానవీయత మిళితం చేసి జేమ్స్‌కెమరాన్‌ అద్భుత సృష్టి చేశారు. ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన హైటెక్నికల్‌ వ్యాల్యూస్‌ కలిగిన చిత్రం ఈ అవతార్‌.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కెమెరా-: ఈ చిత్రానికి వాడిన కెమెరాలను ప్రత్యేకంగా దర్శకుడు తయారు చేయించాడు అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. స్పెషల్‌ ఎఫెక్ట్‌ గురించి చెప్పాలంటే-: ఇంతకు ముందు ఏ సినిమాలో చూడనటువంటి స్పెషల్‌ ఎఫెక్ట్‌ ఈ చిత్రంలోచూపించాడు దర్శకుడు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం.. ఈ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ రూపొందించిన వారిలో భారతీయ తెలుగువారు వుండటం విశేషం. ఎడిటింగ్‌-: చాలా చాలా బాగుంది మాటలు-: వివిధ భారతీయ భాషలో అనువధించబడిన ఈ సినిమా విశేషం ఏమిటంటే... ఈ సినిమా మాటలు వింటుంటే అనువధించిన సినిమాలా అనిపించదు.