English | Telugu
సినిమా పేరు:ఆర్య - 2
బ్యానర్:ఆదిత్య ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Nov 27, 2009
బ్యానర్:ఆదిత్య ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Nov 27, 2009
ఆర్య (అల్లు అర్జున్), అజయ్ (నవదీప్)లు ఓ అనాధాశ్రమంలో పెరిగిన చిన్ననాటి స్నేహితులైనప్పటికీ ఆర్య అంటే అజయ్‌కి పడదు. అనాధ అయిన అజయ్‌ని ఓ ధనవంతుల కుటుంబం దత్తత తీసుకుంటుంది. దాంతో కోటీశ్వరుడిగా పెరిగిన అజయ్‌తో పాటే ఉంటానని అంటాడు ఆర్య. దాంతో తన సాప్ట్‌వేర్ కంపెనీలో అయిష్టంగానే ఉద్యోగం ఇస్తాడు అజయ్. అదే కంపెనీలో పనిచేస్తున్న గీత (కాజల్)ని అజయ్ ఆర్య ఇద్దరూ ప్రేమిస్తారు. అయితే అజయ్ కోసం తన ప్రేమని త్యాగం చేస్తాడు ఆర్య.అజయ్, గీతలు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న సమయంలోనే కర్నూలులో ఉన్న గీత తండ్రి రాజిరెడ్డి (ముఖేష్ ఋషి) గీతకి తన ప్రత్యర్థి అయిన కేశిరెడ్డి (శాయాజీ షిండే) కొడుకు (అజయ్)తో పెళ్లి కుదుర్చుతాడు. రాత్రికి రాత్రే గీతని హైదరాబాదునుండి కర్నూలుకి తీసుకువస్తాడు రాజిరెడ్డి. దాంతో గీతని తీసుకువచ్చి అజయ్‌తో పెళ్ళి జరిపిస్తానని చెప్పి కర్నూలు బయలుదేరిన ఆర్య... కొన్ని కారణాల వల్ల తానే గీతని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో గీతని పెళ్ళి చేసుకుంటాడు. తాను పెళ్లి చేసుకున్నా అజయ్‌తో గీతని అమెరికాకి పంపించడానికి ఆర్య ప్రయత్నిస్తాడు.. చివరికి ఆర్య ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయన్నది మిగతా కథ.