English | Telugu

సినిమా పేరు:అంధగాడు
బ్యానర్:ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
Rating:2.50
విడుదలయిన తేది:Jun 2, 2017

రచయితలు కొత్తగా ఆలోచించడం లేదు. కొత్త కథలు పుట్టుకురావడం లేదు అనే విమర్శ సదా వినిపిస్తూంటూంది. అలాంటి విమర్శకు సమాధానం అంధగాడు. జస్ట్ ఓ మామూలు రివెంజ్ డ్రామాకు ఇన్ని అంశాలు ముడిపెట్టి, కథను కొత్తగా తయారుచేయవచ్చు అన్న దానికి సమాధానం అంధగాడు. నిజానికి ఇదే అంధగాడు కధను పెద్ద హీరోలతో చేసి వుంటే, ఆ లుక్ వేరుగా వుంటుంది. చిన్నహీరో, చిన్న హీరోయిన్ కావడంతో వచ్చిన లుక్ వేరు. ఇంతకీ అంథగాడు కధేంటీ, ఈ సినిమాని ఎలా న‌డిపించారు?  కొత్త ద‌ర్శ‌కుడు ఎలా తీశాడు? ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. 

* క‌థ‌

పుట్టుకతో అంథుడు గౌతమ్ (రాజ్ తరుణ్) ఆశ్రమంలో మరో ముగ్గురితో కలిసి పెరుగుతాడు.  ఆ ముగ్గురికి దాతలు నేత్రాలు ఇవ్వడంతో, వెళ్లిపోతారు. ఇతగాడు మాత్రం అలాగే పెరిగి పెద్దవుతాడు. రేడీయో జాకీగా పని చేస్తుంటాడు. అలాంటి టైమ్ లో ఓ అమ్మాయి (హెబ్బా)ని పరిచయం చేసుకుని, ప్రేమిస్తాడు. చూపులేదని తెలిస్తే ఎక్కడ దూరం అవుతుందో అని చూపు వునట్లు ఆమెను భ్రమింప చేస్తాడు. ఈ డ్రామా అంతా అయిన తరువాత, ఆమెకు నిజం తెలిసి, గౌతమ్ కు చూపు రప్పిస్తుంది.

కానీ అప్పుడే అసలు కథ మొదలవుతుంది. గౌతమ్ కళ్లకు ఆ కళ్లను దానం చేసిన కులకర్ణి (రాజేంధ్ర ప్రసాద్) ఆత్మ కనిపించడం మొదలవుతుంది. రెండు హత్యలు చేసి, తన ఆత్మకు శాంతి కలిగించమని గౌతమ్ ను వేధించడం ప్రారంభిస్తుంది. అనుకోకుండా ఓ హత్య చేసిన గౌతమ్, మరో హత్య చేయకుండా, ఆత్మ బారి నుంచి తప్పించుకోవాలని కిందా మీదా అవుతుంటాడు. ఆత్మ కోరిక నెరవేరిందా? గౌతమ్ పంతం నెరవేరిందా అన్నది మిగిలిన సినిమా.
 


ఎనాలసిస్ :

సినిమా ప్రథమార్థం అంతా జస్ట్ కథలోకి లీడ్ గానే ఉపయోగించాడు దర్శకుడు, కథకుడు వెలిగొండ శ్రీనివాస్. సాధారణంగా ఇరవై నిమషాల నుంచి ముఫ్ఫై నిమషాలు తీసుకుంటారు ఇందుకోసం. కానీ ఈ సినిమాలో దర్శకుడు మొత్తం అసలు కథనంతా ద్వితీయార్థానికి దాచేసి, జస్ట్ లీడ్ ను మాత్రమే ఫస్ట్ హాఫ్ కు వాడుకున్నాడు. అందుకోసం కాస్త ఫన్నీ సీన్లు, హీరో, హీరోయిన్ల ప్రేమ లాంటి వ్యవహారాలను కాస్త పెంచుకున్నాడు. కథ ఒకసారి ద్వితీయార్థంలోకి ప్రవేశించాక పరుగులు పెడుతుంది. ఆ పరుగుకు బ్రేక్ వేసేవి పాటలే తప్ప, దర్శకుడు ఎక్కడా ఏ తప్పిందం చేయలేదు.

ద్వితీయార్థంలో కథ నడిచిన తీరు, అందులో వున్న ట్విస్ట్ లు ఆకట్టకుంటాయి. కథను సీరియస్ నోట్ తో కాకుండా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడిస్తూనే, ఫన్ లైన్ లో నడపడం అనే ఫీట్ ను దర్శకుడు సక్సెస్ ఫుల్ గా నెరవేర్చాడు. ద్వితీయార్థంలో ఎక్కడ ఫన్ పడినా అది పండడం విశేషం. ప్రీ క్లయిమాక్స్ , క్లయిమాక్స్ లో కూడా ఫన్ పండడం అన్నది సినిమాకు ప్లస్ అయింది. అయితే ద్వితీయార్థంలో ఓ పాటను లేపేసి వుంటే మరింత క్రిస్పీగా వుండేదనిపిస్తుంది.

* నటీన‌టులు

సినిమాకు రాజ్ తరుణ్ అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ గా నిలిచాడు. అన్ని రకాల షేడ్స్ ను బాగా పండించాడు. మ‌రీ ముఖ్యంగా అత‌ని కామెడీ టైమింగ్ బాగుంది.  హెబ్బా కూడా ఒకె. కానీ ద్వితీయార్థంలొ ఆమెకు పెద్దగా పని లేదు. షియాజీ షిండే, రాజా రవీందర్, మిగిలిన వారంతా వారి వారి పాత్రల మేరకు చేసారు.  రాజేంద్ర ప్ర‌సాద్ పాత్ర షాకింగ్‌కి గురి చేస్తుంది.

* సాంకేతిక వ‌ర్గం

దర్శకుడు సినిమాకు అందించిన డైలాగులు అతి, మితి కాకుండా సరిపోయాయు. సినిమాకు అన్నీ బాగానే సమకూరినా, నేపథ్య సంగీతం మాత్రం సెట్ కాలేదు. శేఖర్ చంద్ర కు సరైన నేపథ్య సంగీతం అందించేంత స్టామినా లేదనిపిస్తుంది. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోవు. పైగా ఎక్కడో విన్న ఫీలింగ్ కలుగుతుంది. టోటల్ గా చూసుకుంటే, కాస్త డిఫరెంట్ స్క్రిప్ట్ ను, ఎంటర్ టైనింగ్ గా చెప్పాలన్న తొలిప్రయత్నంలో రచయిత, దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ విజయం సాధించాడనే అనుకోవాలి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అంధ‌గాడు కాదు.. అంద‌గాడే

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25