Read more!

English | Telugu

సినిమా పేరు:ఆహ నా పెళ్ళంట
బ్యానర్:ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్
Rating:3.25
విడుదలయిన తేది:Mar 2, 2011

బాస్ ఇచ్చిన పార్టీ ముగిసిన తర్వాత తెల్లవారి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (అల్లరి నరేష్) పక్కలోకి అనుకోకుండా సంజన అనే ఒకమ్మాయి (రీతూ బర్మేచ)వస్తుంది. దాంతో ఆమె అన్నయ్యలు (శ్రీహరి, సుబ్బరాజు, సామ్రాట్) ముగ్గురూ వచ్చి తమ చెల్లెల్ని పెళ్ళి చేసుకోమని అతన్ని అడుగుతారు. "నాకే పాపం తెలియద"ని, మధురిమ (అనిత) అనే అమ్మాయిని తాను ప్రేమిస్తున్నానని అన్నా వాళ్ళు వినిపించుకోరు. అసలా అమ్మాయి అతని రూమ్ లోకి ఎందుకొచ్చింది...? ఎలా వచ్చింది...? చివరికి అతను ఎవరిని చేసుకున్నాడన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

తొలి చిత్రమైనా చాలా బాగా దర్శకత్వం నిర్వహించాడు వీరభద్ర చౌదరి. టైట్ స్క్రీన్ ప్లేతో సినిమాని ఆద్యంతం ఎంటర్ టైన్ మెంట్‍ మిస్సవకుండా సినిమాని చాలా ఆసక్తికరంగా మలచాడతను. జంధ్యాల దర్శకత్వం వహించిన "ఆహ నా పెళ్ళంట" పేరుని ఈ చిత్రానికి వాడుకున్నందుకు ఈ చిత్రానికి, ఆ పేరుకీ పుర్తి న్యాయం చేశాడు వీరభద్ర చౌదరి.

నటన - నరేష్ పేరు వింటేనే గుర్తుకొచ్చేది హాస్య చిత్రాలే. అతని నటన గురించి చెప్పటం చర్విత చర్వణమే అవుతుంది. రీతూ బర్మేచ ఫరవాలేదు.కొత్తమ్మాయి అయినా బాగానే నటించింది. ఇక ఈ సినిమాలో చెప్పుకోవలసిన పాత్రలు రెండున్నాయి. ఒకటి శ్రీహరి, మరొకటి బ్రహ్మానందం. వీళ్ళిద్దరు పండించిన కామెడీ గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన "ఢీ" చిత్రాన్ని మరిపిస్తుంది. నాగినీడు తన పాత్రకు న్యాయం చేశాడు. ఆహుతి ప్రసాద్ కొత్తగా హాస్యాన్ని పండించటం విశేషం. వేణు మాధవ్, యమ్ యస్ నారాయణ, తాగుబోతు రమేష్, పృధ్వి ఇలా అందరూ సినిమాకి అవసరమైనప్పుడల్లా హాస్యాన్ని ఒక టానిక్ లా అందించారు.

సంగీతం - రఘు కుంచె సంగీతం ఫరవాలేదనిపించే స్థాయిలో ఉన్నా కూడా అతన్ని అభినందించాలి. ఎందుకంటే వేటూరి వ్రాసిన "చినుకులా రాలి" పాటను రీమిక్స్ చేసినా దానందం పోకుండా కాపాడినందుకు. కోటి రీ-రికార్డింగ్ బాగుంది.

సినిమాటోగ్రఫీ - బాగుంది.

మాటలు - ఈ చిత్రానికి ప్రథాన ఆకర్షణ మాటలేనంటే అతిశయోక్తి కాదు. అంత బాగున్నాయి ఈ చిత్రంలోని మాటలు. ప్రతి డైలాగ్ పంచ్ డైలాగ్ లానే ఉంటుంది. శ్రీధర్ కొత్త కుర్రాడైనా ఈ చిత్రానికి మాటలు చాలా బాగా వ్రాశాడు. ఇతని మాటల్లో నేటి కాలాగుణంగా కనిపించే హాస్యం బాగుంది. అందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందించాలి.అతనికి మంచి భవిష్యత్తుంది.

పాటలు - సిరాశ్రీ పాటల్లో సాహిత్యం సందర్భోచితంగా ఉండి బాగుంది.

ఎడిటింగ్ - బాగుంది.

ఆర్ట్ - బాగుంది.

కొరియోగ్రఫీ - ఈ చిత్రంలోని కొరియోగ్రఫీ సింపుల్ గా నీట్ గా ఉంది.

యాక్షన్ - ఒ.కె.బాగుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఇ.వి.వి.సత్యనారాయణ వంటి గోప్ప దర్శకుడికి ఈ చిత్రాన్ని అంకితమివ్వటం ముదావహం. ఈ చిత్రానికి ఆ అర్హత ఉంది. జంధ్యాల "ఆహ నా పెళ్ళంట" చిత్రానికి ఇదేం తీసిపోదు. సకుటుంబ సమేతంగా ఓ రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవాలంటే ఈ చిత్రం తప్పక చూడండి.