Read more!

English | Telugu

సినిమా పేరు:అధినాయకుడు
బ్యానర్:శ్రీ కీర్తి కంబైన్స్
Rating:3.50
విడుదలయిన తేది:Jun 1, 2012

కథ - ఈ సినిమా ప్రారంభం ముంబాయిలో జరుగుతుంది. అక్కడ ప్రొఫెషనల్ కిల్లర్ బాబీ (బాలకృష్ణ) ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఒక మధ్యతరగతి అమ్మాయిని రేప్ చేసి చంపినందుకు ఆ మినిస్టర్ కొడుకుని చంపటంతో కథ ప్రారంభమవుతుంది. అతన్ని అలా కిల్లర్ గా మార్చేది అతన్ని రెండేళ్ళ వయసులో రాయల సీమ నుండి కిడ్నాప్ చేసిన చరణ్ రాజ్. రాయల సీమ ప్రజలంతా దేవుడిలా కొలిచే రామకృష్ణ ప్రసాద్ (బాలకృష్ణ) కొడుకే ఈ బాబీ. రామకృష్ణ ప్రసాద్ మేనకోడల (లక్ష్మీ రాయ్)ని అడ్డం పెట్టుకుని అతన్ని చంపాలని భావించే వ్యక్తి చరణ్ రాజ్ ని సంప్రదించటం వలన బాబీకి తన తల్లిదండ్రుల గురించి తెలిసి, తన మరదలని, తన కుటుంబాన్ని కాపాడాలనుకుని వైజాగ్ వస్తాడు.

కానీ రామకృష్ణ ప్రసాద్ తన కొడుకని తెలిసి కూడా బాబీని ఇంటికి రావద్దంటాడు...! బాబీ ఎలా తన ఇంటికి ఎలా వెళ్ళాడు. తన తండ్రి బాబీని ఎందుకు ఇంటికి రావద్దన్నాడు...! ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే ఈ "అధినాయకుడు" చిత్రం చూడాల్సిందే.


ఎనాలసిస్ :

విశ్లేషణ - ఈ సినిమాతో పరుచూరి మురళి పెద్ద దర్శకుల జాబితాలోకి వెళ్ళాడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా పట్టుగా ఉండి, ఎక్కడా ప్రేక్షకులకు బోర్ కొట్టనివ్వదు సరికదా చాలా ఆసక్తి కలిగిస్తుంది. ఫ్యాక్షన్ కథ కొత్తది కాకపోయినా దాన్ని చూపించిన విధానం కొత్తగా ఉండి ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ చిత్ర నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

సంగీతం - ఈ చిత్రం ఆడియో ఇప్పటికే హిట్టయ్యింది. అలాగే రీ-రికార్డింగ్ కూడా చాలా బాగుంది. కళ్యాణి మాలిక్ సంగీతమ ఈ చిత్రానికి బాగా ప్లస్సయ్యింది.

నటన - బాలయ్య ఈ చిత్రంలో మూడు పాత్రల్లో నటించాడు. మూడు పాత్రలకున్న వేరియేషన్స్ చాలా చక్కగా చూపించాడు బాలయ్య. తాతగా అతని హావభావాలు, బాడీ లాంగ్వేజ్ గెటప్ అద్భుతంగా ఉండగా, కొడుకు పాత్రలో సెంటిమెంట్ ని చాలా హుందాగా పండించాడు. ఇక మనవడిగా డ్యాన్సులు చాలా బాగా చేశాడు బాలయ్య. 53 యేళ్ళ వయసులో కూడా కుర్రాళ్ళతో పోటీపడి మరీ డ్యాన్సులు చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. యాక్షన్ సీన్లలో ఎక్కడా ఎనర్జీ తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఎనర్జీ లెవల్స్ ఇంకఆ పెరుగాయనే చెప్పాలి. ఇక కోట శ్రీనివాసరావు, మురళీ శర్మ, ప్రదీప్ రావత్ ల పాత్రలు వారికి కొట్టిన పిండి. లక్ష్మీ  రాయ్ చురుగ్గా కనిపించింది. జయసుధ పాత్ర నిడివి తక్కువే అయినా ఆ పాత్రలో ఆమె జీవించింది. ఇక బ్రహ్మానందం కామెడీ బాగానే పండింది.

కెమెరా - చాలా బాగా ఉండి కనులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంది. ఈ సినిమాని బాగా చూపించటంలో కెమెరా పనితనం బాగుంది. పాటల్లో, యాక్షన్ సీన్లలో కెమెరా పనితనం చాలా బాగుంది.

పాటలు - పాటల్లో సాహిత్యం వినసొంపుగానే ఉంది. ఎక్కడా అశ్లీలత కానీ అసభ్యత కానీ లేవు. సెంటిమేంట్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

మాటలు - ఈ చిత్రంలో పొలిటికల్ సెటైర్లు ఉన్నా అవి ఎ ఒక్కరినో ఉద్దేశించి కాక, అందరినీ ఉద్దేశించినట్టుగానే ఉంటాయి. కానీ బాలయ్య ఎవర్ని టార్గెట్ చేశారో ప్రేక్షకులకు ఈ చిత్రంలోని మాటల ద్వారా తేలిగ్గా అర్థమవుతుంది. కానీ అభ్యంతరం చెప్పటానికి ఎవరికీ అవకాశం లేకుండా ఈ చిత్రంలోని మాటలున్నాయి. మాటలు చాలా పదునుగా ఉన్నాయి.

ఎడిటింగ్ - బాగుంది...! ఎక్కడా అనవసరమైన ల్యాగ్ లేకుండా ఎడిటింగ్ నీట్ గా, క్రిస్ప్ గా ఉంది.

 

ఆర్ట్ - వేదముని సెట్ చాలా బాగుంది. అలాగే ఈ చిత్రంలోని ఆర్ట్ పనితనం కుడా చాలా బాగుంది.

కొరియోగ్రఫీ- బాగుంది...! చాలా కాలం తర్వాత సమరసింహా రెడ్డి స్టైల్లో బాలయ్యకు ఈ చిత్రంలోని పాటల్లో స్టెప్పులు కుదిరాయి...!

యాక్షన్ - ఈ చిత్రంలోని యాక్షన్ చాలా బాగుంది. కాస్త అసహజమే అయినా బాలయ్య వంటి కమర్షియల్ హీరోకి ఆ మాత్రం ఉండటంలో తప్పులేదు.

మొత్తానికి ఈ చిత్రం బాలయ్య అభిమానులకు మాత్రం పండగలా ఉంటుంది. అలాగే బాలయ్య నట విశ్వరూపం చూడాలంటే మాత్రం తప్పక చూడండి. మామూలు ప్రేక్షకులు కూడా చక్కని సినిమా చూడాలనుకుంటే సకుటుంబంగా ఈ చిత్రాన్ని తప్పకుండా చూడొచ్చు...!