English | Telugu

సినిమా పేరు:అడవి
బ్యానర్:విశాఖాటాకీస్
Rating:2.25
విడుదలయిన తేది:Aug 7, 2009
బ్యానర్:విశాఖాటాకీస్
Rating:2.25
విడుదలయిన తేది:Aug 7, 2009
సినిమా షూటింగ్ నిమిత్తం ఏ వసతులూ లేని అడవి ప్రదేశానికి వెళ్తుంది ఒక చిత్రం యూనిట్.ఆ చిత్రం యూనిట్ లో హీరో శర్మాన్, హీరోయిన్ ఆశా, నిర్మాత మూర్తి, దర్శకుడు జె.జె., అతని అసిస్టెంట్ కాళీప్రసాద్, కెమెరామేన్ లక్ష్మణ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ సుజన, సమీర ఉంటారు. వీళ్ళకి ఆ అడవిలో ఉండే సేతు ఒక గైడ్ లా ఉంటాడు.అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరా పాడవటం వల్ల, మరో కెమెరా అక్కడికి తెప్పించటానికి రెండు రోజుల సమయం పడుతుంది గనుక, సేతు అనే లోకల్ వ్యక్తితో కలసి ఈ యునిట్ ఆ అడవిని చూడటానికి వెళ్తారు. ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారి లేవగానే, వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళిన ఆ ఊరివాడు సేతు భయంకరంగా చంపబడి ఉంటాడు. ఇక్కడ వీళ్ళ దురదృష్టం ఏమిటంటే ఆ అడవిలో నుండి బయటకు రావటం అనేది తెలిసిన వ్యక్తి ఆ సేతు ఒక్కడే వాడే చంపబడటంతో, తిరిగి వస్తూ దారి తప్పిపోయి ఆ అడవిలో అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. తర్వాత ఆ చిత్ర నిర్మాత మూర్తి (ఇస్రత్ ఆలీ)కూడా అదే విధంగా చంపబడతాడు. తర్వాత ఆ చిత్ర దర్శకుడు జె.జె.కూడా అదే విధంగా చంపబడి ఒక చెట్టు మీద కనపడతాడు. ఎవరు చంపుతున్నారో తెలియదు. అది జంతువు పనా..? మనిషి పనా..? లేక ఏదైనా దుష్టశక్తా.? అన్న విషయం వీళ్ళకి అర్థం కాదు. ఆ దుష్టశక్తి బారి నుంచి పారిపోతూండగా ఆ చిత్రం కెమెరామేన్ లక్ష్మణ్ తీవ్రంగా గాయపడతాడు. అతను కదలలేని స్థితిలో ఉంటాడు. అతన్ని వదిలేసి పోదామంటాడు ఫైట్‍మాస్టర్ రక్కా. అతన్ని తీసుకెళ్ళాల్సిందేనని అంటాడు అసిస్టెంట్ డైరెక్టర్ సుజన్ (నితిన్). ఈ విషయంపై ఆ చిత్రం హీరోశర్మాన్ (గౌతమ్ రోడి)కీ ఫైట్‍మాస్టర్ రక్కా (రవికాలే)కి గొడవవుతుంది. వీళ్ళు తన్ను కోవటం చూసిన కెమెరామేన్ లక్ష్మణ్ కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. జరిగిందేదో జరిగింది మనం అందరం కలసి ఉంటే తప్ప ఈ అడవిలో నుండి బయట పడలేమని సుజన్ కొట్టుకుంటున్న వాళ్ళకి చెపుతాడు. ఆ గొడవ ఆపారనుకుంటున్నంతలో రక్కా పెద్దరాయి తీసుకుని వెనుక నుంచి హీరో తలమీద బలంగా కొడతాడు. దాంతో అతను చనిపోతాడు.అదే సమయానికి ఒక భయంకర శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడల్లా ఒకరు చంపబడుతుండటంతో వీళ్ళు భయంతో పారిపోతూంటారు. రక్కా మాత్రం ఆ శబ్దం వచ్చిన వేపు ఛాలెంజ్ విసురుతాడు. ఆ వెంటనే అతను కూడా దారుణంగా చంపబడతాడు. మిగిలిన నలుగురిలో హీరో అసిస్టెంట్ మిగిలిన వారి నుండి విడిపోయి తను నమ్మిన కాళీమాతను స్మరించుకుంటూ వెళుతూంటాడు. సుజన్ తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సమీర అనే అమ్మాయి వీళ్ళతో ప్రయాణం చేయలేక కొండమీద నుండి దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. హీరోయిన్ ఆశ, సుజన్ కలసి ఆ అడవి నుండి ఎలా బయటపడాలా అని ప్రయాణం చేస్తూండగా హీరో అసిస్టెంట్ కూడా మరణించటం వీళ్ళిద్దరికీ కనిపిస్తుంది. అంతమందిని చంపిన ఆ శక్తి నుండి ఎలా తప్పించుకున్నారనేది మిగిలిన కథ.