English | Telugu

సినిమా పేరు:అభినేత్రి
బ్యానర్:ఎంవీవీ సినిమా, కొన ఫిల్మ్ కార్పొరేషన్
Rating:2.00
విడుదలయిన తేది:Oct 7, 2016

ఓవైపు కొత్త కొత్త క‌థ‌లు పుడుతున్నాయి. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు స‌రికొత్త ఐడియాల‌తో ముందుకొస్తున్నారు. ఫ్రెష్ సినిమా అంటే ఏమిటో చూపిస్తున్నారు. మ‌రోవైపు అదే పాత చింత‌కాయ్ ప‌చ్చ‌డి, అదే ఫార్ములా క‌థ‌ల‌తో సినిమాలు వండేయ‌డానికి ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌డం లేదు కొంత‌మంది ద‌ర్శ‌కులు. దుర‌దృష్టం కొద్దీ స‌క్సెస్ రేటు కూడా అలాంటి సినిమాల‌కే ఎక్కువ ఉండ‌డంతో... రిస్క్ లేని ఇలాంటి యాపార‌మే బెట‌ర్ అనే నిర్ణ‌యానికొచ్చేశారు. అలా... ఫ‌క్తు ఫార్ములా క‌థ‌తో వ‌చ్చిన సినిమా.. అభినేత్రి. హార‌ర్ సినిమా అంటే ఇలా ఉండాలి, ఆత్మ క‌థ‌లంటే ఇలా ఉండాలి అంటూ.. ఓ ఫార్ములా ఉంది మ‌న‌కు. దాన్ని తుచ త‌ప్ప‌కుండా పాటించింది ఈ అభినేత్రి. మ‌రి... ఫార్ములాలో వెళ్లిన ఈ అభినేత్రికి స‌క్సెస్ దొరికిందా?  లేదా?  తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.


* క‌థ‌

ముంబైలోని ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే కృష్ణ (ప్రభుదేవా)కు పెళ్లి విష‌యంలో కొన్ని క‌ల‌లు, ల‌క్ష్యాలూ ఉంటాయి. త‌న‌లా చ‌లాకీగా ఉంటూ.. ఇంగ్లీష్ మాట్లాడే మోడ్ర‌న్ అమ్మాయిని పెళ్లి చేసుకొందామ‌నుకొంటాడు. అయితే..

ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేయ‌డంతో  దేవి(తమన్నా)ని ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుంటాడు. కాపురానికి ముంబై తీసుకొచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో మ‌కాం పెడ‌తాడు. త‌న‌ని ఎలాగైనా స‌రే స‌ముదాయించి తిరిగి ఊరు పంపించేద్దామ‌న్న ప్ర‌యత్నాల్లో ఉంటాడు. ఆ ఆపార్ట్‌మెంట్‌లోకి రాగానే దేవి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌స్తుంది. త‌న‌లో రూబీ (త‌మ‌న్నా) ఆత్మ ప్ర‌వేశిస్తుంది. అక్క‌డి నుంచి కృష్ణ‌కు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. సినిమా హీరో రాజ్ (సోనూ సూద్) దేవిని చూసి.. ఆమె అందానికి ముగ్థుడైపోతాడు. త‌న సినిమ‌లో క‌థానాయిక‌గా ఆఫ‌ర్ ఇస్తాడు.  అక్క‌డి నుంచి రూబీ... రాజ్‌కి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. ఇంత‌కీ రూబీ ఎవ‌రు?  ఎందుకు ఆత్మ రూపంలో దేవిని ఆవ‌హించింది?  రాజ్‌ని టార్గెట్ చేయ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణాలేమైనా ఉన్నాయా?  అనేదే ఈ అభినేత్రి క‌థ‌.

 


ఎనాలసిస్ :

* విశ్లేషణ

అభినేత్రి సినిమాని ముందు నుంచీ హార‌ర్‌, కామెడీ సినిమా అంటూ ప్ర‌చారం చేసుకొంటూ వ‌చ్చారు. ఈ లైన్‌లో అవి  రెండూ పుష్క‌లంగా మేళ‌వించే అవ‌కాశం ఉంది. కానీ విజ‌య్ మాత్రం అది కొంత ఇది కొంత అంటూ మ‌రీ పిసినారి త‌నం చూపించాడు. క‌థా ప‌రంగా కొత్త వ‌స్తువేం కాదు. హార‌ర్‌, కామెడీ జోన‌ర్లో ఇలాంటి క‌థ‌లు చాలా చాలా వ‌చ్చేశాయి. సినిమాటిక్ స‌న్నివేశాలు, లాజిక్‌కి అంద‌ని సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అయితే హార‌ర్ కామెడీ కాబ‌ట్టి.. లాజిక్కుల్ని తీసి ప‌క్క‌న పెట్టేయొచ్చు. క‌థ‌ని ప్రారంభించిన విధానం చాలా సాదాసీదాగా ఉంది. స‌న్నివేశాలు ఎన్ని క‌రుగుతున్నా, రీళ్లు ఎన్ని వెళ్లిపోతున్నా.. అస‌లు విష‌యం క‌నిపించ‌దు. రూబీ ఎంట్రీతో.. క‌థ ఓ దారిన ప‌డుతుంది. సోనూసూద్ - త‌మ‌న్నా మ‌ధ్య స‌న్నివేశాలు మ‌రింత బెట‌ర్‌గా ట్రీట్ చేయాల్సింది. ఇంట్ర‌వెల్ వ‌చ్చేసరికి ఈ క‌థేంటి?  ఎటు ప‌రుగు పెడుతుంది?  త‌రువాత ఏమ‌వుతుంది? అనేవి ఊహించ‌డం పెద్ద‌గా క‌ష్టం కాదు. త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సోనూసూద్‌లాంటి హేమా హేమీలు ఉండ‌డం వ‌ల్ల సాధార‌ణ స‌న్నివేశం కూడా కాస్త చూడ‌బుల్‌గా త‌యారైంది. దాంతో పాటు సాంకేతిక విలువ‌లు ఈ సినిమాని అండ‌దండ‌లుగా నిలిచాయి. దాంతో.. ఫ‌స్టాఫ్ టైమ్ పాస్ అయిపోతుంది. ఏం జ‌రుగుతుందో ముందే తెలిసిపోవ‌డంతో ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ మిస్స‌యిన‌ట్టైంది. భ‌య‌పెట్టేందుకు స్కోప్ ఉన్నా దాన్ని వాడుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అప్ప‌టికీ స‌ప్త‌గిరి, ప్ర‌భుదేవాలు ఏదో ట్రై చేశారు. విశ్రాంతికి ముందొచ్చే స‌న్నివేశాలు. ప్రీ  క్లైమాక్స్ స‌న్నివేశాలు ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం. ట్విస్టున్నా.. వాటిని ఇంట్ర‌స్టుగా చూపించ‌లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌


* న‌టీన‌టులు

ఈత‌ర‌హా క‌థ‌ల్లో న‌టించ‌డం ప్ర‌భుదేవాకు ఇదే తొలిసారి. తాను ఎలాంటి పాత్ర‌నైనా పండించ‌గ‌ల‌న‌ని ఈ సినిమాతో మ‌రోసారి నిరూపించుకొన్నాడు. ప్ర‌భుదేవా డాన్సుల‌కు ఫ్యాన్ అయిన‌వాళ్లెవ్వ‌రూ ఈ సినిమాని మిస్ చేయ‌కూడ‌దు.

త‌న భార్య మ‌రొక‌రికి ఎక్క‌డ ద‌గ్గ‌రైపోతుందో అంటూ మ‌థ‌న‌ప‌డే పాత్ర‌లో చ‌క్క‌గా ఇమిడిపోయాడు. లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పినా ఈ క‌థ‌లో త‌మ‌న్నాకు అంత సీన్ లేదు. క‌థ‌లో ఓ భాగం మాత్ర‌మే. అయితే త‌న అంద‌చందాల‌తో క‌ట్టిప‌డేసింది. డాన్స్‌లో ఎవ్వ‌రికీ త‌క్కువ కాదంటూ ఓ పాట‌లో నిరూపించింది. ప‌ల్లెటూరి అమ్మాయిగా ఎంత ప‌ద్ద‌తిగా ఉందో... హీరోయిన్ అవ‌తార్‌లో అంత విజృంభించింది. క‌చ్చితంగా సోనూసూద్‌కి ఇది విభిన్న‌మైన పాత్రే. త‌న‌తో తొలిసారి డాన్సులు కూడా చేయించారు. సోనూ ఎక్స్‌ప్రెష‌న్స్ అక్క‌డ‌క్క‌డా న‌వ్వు తెప్పిస్తాయి. ఓవరాల్‌గా న‌టీన‌టుల ప‌రంగా లోపాలేం క‌నిపించ‌వు.


* టెక్నిక‌ల్‌గా
టెక్నిక‌ల్‌గా ఈ సినిమా హై స్టాండ‌ర్డ్స్లో ఉంది. పాట‌లు విన‌సొంపుగా లేవు ఒక్క పాటైనా అర్థ‌మ‌యితే ఒట్టు. ప్ర‌భుదేవా, త‌మ‌న్నాల డాన్సులు చూసి మురిసిపోవాల్సిందే.  విజ‌య్ ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన మార్క్ చూపించ‌లేక‌పోయాడు. కొన్ని స‌న్నివేశాల్లో మెరిసినా.. ఓవ‌రాల్ గా నిరుత్సాహ‌పరిచాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మంచి మంచి క‌థాంశాల‌తో సినిమాలు తీసే విజ‌య్‌.. ఈసారి ఇంత రొటీన్ క‌థ ఎందుకు ఎంచుకొన్నాడో అర్థం అవ్వ‌దు.   ప్ర‌భుదేవా, త‌మ‌న్నా డాన్సుల కోసం.. కొన్ని కామెడీ బిట్ల కోసం ఈసినిమా చూడొచ్చు. అంత‌కు మించి ఆశిస్తే... నిరాశే ఎదుర‌వుతుంది.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25