English | Telugu

సినిమా పేరు:ఆరడుగుల బుల్లెట్
బ్యానర్:జయ బాలాజీ రియల్ మీడియా
Rating:2.00
విడుదలయిన తేది:Oct 8, 2021

సినిమా పేరు: ఆరడుగుల బుల్లెట్ 
తారాగణం: గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్ తదితరులు
కథ: వక్కంతం వంశీ
మాటలు: అబ్బూరి రవి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: ఎం. బాలమురుగన్ 
సంగీతం: మణిశర్మ
నిర్మాత: తాండ్ర రమేష్
దర్శకత్వం: బి. గోపాల్ 
విడుదల తేదీ: 8 అక్టోబర్ 2021

 

'ఆరడుగుల బుల్లెట్' సినిమా ఎట్టకేలకు ఈ రోజు విడుదలయ్యింది. క‌రోనాకు ముందు రెడీ అయ్యిన సినిమాలు కొన్ని రెండు లాక్‌డౌన్స్ త‌ర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. క‌రోనాకు ముందు కాదు, అంత‌కు ముందు ఎప్పుడో ఈ సినిమా రెడీ అయ్యింది. ఫైనాన్షియ‌ల్ ప్రాబ్ల‌మ్స్ వ‌ల్ల విడుద‌ల‌కు నోచుకోలేదు. జ‌గ‌న్మోహ‌న్ ఐపీఎస్ టైటిల్‌తో త‌మిళ ద‌ర్శ‌కుడు భూప‌తి పాండ్య‌న్‌తో సినిమా సెట్స్ మీదకు వెళ్ళంది. ద‌ర్శ‌కుడికి, టీమ్‌లో ఇత‌రుల‌కు ఏవో ప్రాబ్ల‌మ్స్ రావ‌డంతో భూప‌తి పాండ్య‌న్ సినిమా నుండి తప్పుకొన్నాడు. బి. గోపాల్ సినిమాను కంప్లీట్ చేశారు. ఆ తర్వాత కూడా వివిధ సమస్యల వల్ల విడుదల ఆలస్యమైంది. ఇప్పుడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?

 

కథ:

శివ (గోపీచంద్) ఆకతాయి కుర్రాడు. ముప్ఫై ఏళ్ల వయసు వచ్చినా బాధ్యత తెలుసుకోకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. అతడి తండ్రి (ప్రకాష్ రాజ్) బాధ్యత లేదని కుమారుడిని ఎప్పుడూ తిడుతుంటాడు. 'పోషించలేనివాడికి ప్రేమ ఎందుకు?' అని ప్రశ్నిస్తాడు. ఒకానొక సమయంలో ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. తల్లి ఫోన్ చేయడంతో మళ్ళీ ఫ్యామిలీకి దగ్గర అవుతాడు. అసలు, శివకు తల్లి ఎందుకు ఫోన్ చేసింది? ఏం చెప్పింది? కాశి (అభిమన్యు సింగ్) ఎవరు? అతడికి, శివ తండ్రికి మధ్య ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.


ఎనాలసిస్ :

సినిమా చూస్తున్నంతసేపూ మనసులో ఒక్కటే ఆలోచన మనల్ని వెంటాడుతుంది. ఇది ఎప్పటి సినిమా? అని! ముందుగా చెప్పినట్టు ఇది పాత సినిమా. దాదాపు నాలుగేళ్ల క్రితమే రెడీ అయిన సినిమా. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన సినిమా. ఈ ఎనిమిదేళ్లలో కథ, కథనాలు చాలా మారాయి. కమర్షియల్ అంశాల పరంగానూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని మార్పులు వచ్చాయి. అందువల్ల, 'ఆరడుగుల బుల్లెట్' రొటీన్ కమర్షియల్ సినిమాలా కాదు, రొటీన్ రొట్ట కొట్టుడు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. 

 

అసలు, సినిమా కథకు వస్తే... తెలుగులో ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయి. గోపీచంద్ కూడా చేశాడు. అందువల్ల, కథలో మాత్రమే కాదు... అతడి పాత్రలో కూడా కొత్తదనం లేదు. అసలు కథంతా ఫస్టాఫ్ లో ఉంది. సెకండాఫ్ సాగదీసినట్టు ఉంది. బి. గోపాల్ దర్శకత్వం అవుట్ డేటెడ్ అనిపిస్తుంది. మణిశర్మ సంగీతంలో గుర్తు ఉంచుకునే పాటలు లేవు. నేపథ్య సంగీతం బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.

 

నటీనటుల పనితీరు:

ఇటీవల వచ్చిన గోపీచంద్ సినిమాలతో పోలిస్తే... ఈ సినిమాలో కొంత యంగ్ గా కనిపించాడు. బహుశా... ఎప్పుడో తీసిన సినిమా కావడం వల్ల అనుకుంట! నటనకు వస్తే... కమర్షియల్ సినిమాకు ఏం కావాలో అది చేశాడు. ముఖ్యం ఫైట్స్ ఇరగదీశాడు. బ్రహ్మానందంతో ఆయన కామెడీ సీన్లు బావున్నాయి. నయనతార అందంగా కనిపించింది. ప్రకాష్ రాజ్ కు ఇటువంటి పాత్రలు కొట్టిన పిండి కావడంతో అలవోకగా నటించారు. హీరో చేతిలో తన్నులు తినే రొటీన్ విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ కనిపించాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

తెలుగు సినిమాల్లో చాలాసార్లు చూసేసిన కథతో తెరకెక్కిన సినిమా 'ఆరడుగుల బుల్లెట్'. ఇది కమర్షియల్ బుల్లెట్ కాదు... పాత బుల్లెట్. టార్గెట్ చేరుకోవడం కష్టమే. కేవలం ఫైట్స్ కోసం, గోపీచంద్ కోసం ఎవరైనా సినిమా చూడాలని అనుకుంటే థియేటర్లకు వెళ్ళవచ్చు. లేదంటే లైట్ తీసుకోవచ్చు.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25