English | Telugu

సినిమా పేరు:ఆ ఇంట్లో
బ్యానర్:యు 9 ఎంటర్ టైన్ మెంట్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 16, 2009
బ్యానర్:యు 9 ఎంటర్ టైన్ మెంట్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 16, 2009
కథ మొత్తం చెపితే ఈ చిత్రంలోని సస్పెన్స్ ఎలిమెంట్ తెలిసిపోతుంది. అందుకే ఈ కథని క్లుప్తంగా చెపుతాను. పవన్ (చిన్నా), పల్లవి (మయూరి) ఇద్దరూ భార్యాభర్తలు. వారికిద్దరు పిల్లలు. పక్కవాళ్ళు అసూయపడేలా ఉండే చాలా చక్కని సంసారం. చాలా సంతోషంగా వారంతా జీవితం గడుపుతుంటారు. ఉన్నట్టుండి పల్లవికి ఆరోగ్యం బాగోదు. ఆమెను హాస్పిటల్లో చేరుస్తాడు పవన్. అక్కడ ఆమె చనిపోయినంత పనయ్యి , మళ్ళీ బ్రతుకుతుంది. ఆమె కాస్త తేరుకున్నాక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తూ, ఆమెకు హిస్టీరియా అనీ, ఆమెతో కొన్ని నెలల వరకూ శారీరకంగా కలవ వద్దని డాక్టర్ పవన్ కి చెపుతాడు. ఆమె ఇంటికి వచ్చిందగ్గర నుంచీ ఎప్పుడూ భర్తతో శారీరకంగా కలవటానికి తపించిపోతుంటుంది. ఇంట్లో కూడా ఊహకందని విచిత్రాలు జరుగుతూంటాయి. పల్లవి అనవసరంగా చిన్నాని అనుమానించి విసిగిస్తుంటుంది. పిల్లలను అనవసరంగా కొడుతుంది. వాళ్ళింట్లోని తులసి చెట్టు ఎండిపోతూంటుంది.కొత్త చెట్టు పెట్టినా అది కూడా మళ్ళీ ఎండిపోతుంది. ఇది గమనించిన పవన్ స్నేహితుడు (రాం జగన్) ఒక పంతులు (ఎ.వి.యస్ ) గారిని పిలిపించి శాంతి చేయిస్తాడు. శాంతిచేసిన అనంతరం "రేపు ఈ చెట్టు పాడవటానికి కారణమైన వారు ఈ గిరిలో ఉంటార" ని అక్కడో గిరి గీసి చేపుతాడు పంతులు. దెయ్యాల్నీ, దేవుణ్ణి నమ్మని పవన్ కి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. కానీ తేల్లారే సరికి శాంతి చేసిన పంతులు తానే ఆ గిరిలో చచ్చిపడి ఉంటాడు. రాత్రి పూట పవన్ కి తన ఇంట్లో ఎవరో భయంకరంగా, హృదయవిదారకంగా మూలుగుతూ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంటుంది. ఒక అఘోరా (భిక్షు) టైపు స్వామీజీ ఈ పరిస్థితి అంతా గమనిస్తూ ఉంటాడు. చివరికి తన స్నేహితుడి బలవంతంతో పవన్ ఒక జ్యోతిష్యు (కోట)డి వద్దకు వెళతాడు. అక్కడ పల్లవి జాతకం చూపిస్తే "చనిపోయిన వాళ్ళకి కూడా జాతకం చేపుతారా...?" అని ఎదురు ప్రశ్నిస్తాడు ఆ జ్యోస్యుడు. దాంతో పవన్ అతన్ని కొట్టబోతాడు. నిజంగా పల్లవి చనిపోయిందా...? అసలా పల్లవి ఎలా చనిపోయింది... ఆ ఇంట్లో ఏం జరుగుతోంది...? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.