English | Telugu

సినిమా పేరు:4 లెట‌ర్స్
బ్యానర్:ఓం శ్రీ చక్ర క్రియేషన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Feb 22, 2019

న‌టీన‌టులుః   ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా, కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ 
సాంకేతిక నిపుణులు:
పాట‌లు:  సురేశ్ ఉపాధ్యాయ‌, 
కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌, 
మ్యూజిక్:  భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్ర‌ఫీ:  చిట్టిబాబు.కె
క‌థ‌-మాట‌లు-స్ర్కీన్ ప్లే-ఎడిటింగ్ః ఆర్.ర‌ఘురాజ్‌
విడుద‌ల తేదిః  22-2-2019


`క‌లుసుకోవాలని` చిత్రంతో తెలుగులో ద‌ర్శ‌కుడుగా మంచి పేరు తెచ్చుకోని ఆ త‌ర్వాత త‌మిళ్ , క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు చేసి `4 లెట‌ర్స్` చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోన్న ద‌ర్శ‌కుడు ఆర్ ర‌ఘురాజ్‌. కాన్సెప్ట్ కొత్త గా ఉంటే చాలు కాస్టింగ్ కొత్త , పాత అని చూడ‌ట్లేదు ప్రేక్ష‌కులు. అందుకే ఓ ఫ్రెష్ కంటెంట్ తీసుకుని ఈశ్వ‌ర్ అనే కొత్త కుర్రాడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ `4 లెట‌ర్స్` చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బేన‌ర్ పై దొమ్మ‌రాజు ఉద‌య్ భాస్క‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా , ట్రైల‌ర్ , సాంగ్స్ ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీని పెంచాయి.  మ‌రి ఈ రోజు విడుద‌లైన సినిమా ప్రేక్ష‌కులను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..


క‌థ‌లోకి వెళితే...

త‌న కొడుకు (హీరో ఈశ్వ‌ర్)  ధ‌న‌వంతుల జాబితాలో ఉండాల‌న్న‌ది  (సురేష్‌) తండ్రి కోరిక‌.  త‌న కూతురు హీరోయిన్ (టువ చ‌క్ర‌వ‌ర్తి)  ప్రేమ అనే వ‌ల‌లో ప‌డ‌వ‌ద్దన్న‌ది  త‌ల్లి (కౌస‌ల్య‌) కోరిక‌,    ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న హీరో హీరోయిన్స్ ఓ ఇన్స్ డెంట్ ద్వారా క‌లుస్తారు. ఆ పరిచ‌యం ప్రేమ‌గా మారుతుంది.   కానీ,  త‌ల్లి మాట‌కు క‌ట్టుబ‌డి త‌న ప్రేమ‌ను కాద‌నుకుంటుంది హీరోయిన్ . ఆ త‌ర్వాత రియ‌లైజ్ అవుతుంది. కానీ  ఇంత‌లో  హీరో మ‌రో అమ్మాయి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అన్న‌దే సినిమా  క‌థాంశం.


న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్ః

ఈశ్వ‌ర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. త‌న‌కిదే తొలి సినిమా అయినా ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా న‌టించాడు. ముఖ్యంగా లెంగ్తీ డైలాగ్స్ అల‌వోక‌గా చెప్పేసాడు. కానీ డ‌బ్బింగ్ మ‌రొక‌రి చేత చెప్పించి ఉంటే బాగుండేది. ఒక కొత్త హీరోలా కాకుండా ఎంతో అనుభ‌వం ఉన్న హీరోలా న‌టించాడు. ముఖ్యంగా డాన్స్ , ఫైట్స్ లో చాలా ఈజ్ కనిపించింది. ఇందులో ఒక పాట కూడా పాడ‌టం విశేషం. ఇంకా కొంచెం త‌న‌ను తాను మెరుగు ప‌రుచుకుంటే భ‌విష్య‌త్ లో మంచి హీరో అయ్యే అవ‌కాశాలుంటాయి.  అలాగే హీరోయిన్స్ టువ చ‌క్ర‌వ‌ర్తి న‌ట‌న చాలా స‌హ‌జంగా అనిపించింది. మ‌హారాణా గ్లామ‌ర్ ప‌రంగా ఆక‌ట్టుకున్నా, న‌ట‌న ప‌రంగా ఆక‌ట్టుకోదు. డైలాగ్స్ అప్ప‌జెప్పేసింది. ఇక ధ‌న్ రాజ్, మ‌హేష్ విట్టా, విద్యుల్లేఖా రామ‌న్ క‌డుపుబ్బ న‌వ్విస్తారు. సురేష్ ,సుధ‌, పోసాని ఎప్ప‌టిలాగే త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సీనియ‌ర్ న‌టి అన్న‌పూర్ణ‌మ్మ క్యార‌క్ట‌ర్ డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంది. 


సాంకేతిక నిపుణుల ప‌నితీరుః

ద‌ర్శ‌కుడు తీసుకున్న క‌థ, క‌థ‌నాలు కొత్త‌గా లేక‌పోగా సినిమా మొత్తం డ‌బుల్ మీనింగ్స్ డైలాగ్స్ తో నింపేసాడు.  ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన పాట‌లు,  నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. సినిమాటోగ్ర‌ఫీ కూడా ఒక ల‌వ్ స్టోరి కి ఎంత క‌ల‌ర్ ఫుల్ గా ఉండాలో అంత క‌ల‌ర్ ఫుల్ గా ఉంది.  డైర‌క్ట‌ర్ ఇందులో ఒక వినూత్న ప్ర‌య‌త్నం చేసాడు అదేమిటంటే...ఏ  డైలాగ్ తో అయితే  సీన్ ఎండ్ అవుతుందో ..అదే డైలాగ్ తోనో  లేక వ‌స్తువుతో నో మ‌రో సీన్ ఓపెన్ చేయ‌డం . సినిమా మొత్తం అలా మెయిన్ టెన్ చేయ‌డం కొంచెం  క‌ష్ట‌మే అయినా ఈ విష‌యంలో డైర‌క్ట‌ర్ త‌న ప్ర‌తిభ చూపించాడు.. అలాగే సునిశితంగా ప‌రిశీలిస్తే ఇందులో ప్ర‌తి క్యార‌క్ట‌ర్ పేరు `అ`తోనే స్టార్ట్ అవుతుంది.    గ‌తంలో ఇలాంటి ప్ర‌యోగాల జ‌రిగినా...సినిమా లో ప్ర‌తి స‌న్నివేశం అలాగే ఉండ‌టం ప్ర‌శంసించ‌ద‌గ్గ అంశం.   ఇక నిర్మాత‌ల‌కిది తొలి సినిమా అయినా ఎక్క‌డా రాజీ పడ‌కుండా చాలా రిచ్ గా సినిమాను నిర్మించారు.


ఎనాలసిస్ :

ట్రెండీ టైటిల్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేసే డైలాగ్స్ ఉన్నా...  క‌థ‌లో చెప్పుకోద‌గ్గ కాన్ ఫ్లిక్ట్ లేదు. ఏ ఒక్క పాత్ర కూడా స్ట్రాంగ్ గా కనిపించదు.  కొన్ని డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ శృతిమించాయి. అవి యూత్ ఎంజాయ్ చేసినా...ఫ్యామిలీ ఆడియ‌న్స్ మాత్రం  క‌నెక్ట్ కాలేదు. ద‌ర్శ‌కుడు ఫ‌స్టాప్ అంతా ఎక్క‌డా బోర్ లేకుండా స‌ర‌దా స‌ర‌దాగా కానిచ్చేసిన‌ప్ప‌టికీ సెకండాఫ్ కు వ‌చ్చేసరికి ఆడియ‌న్స్ స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు. ఇక క్లైమాక్స్ మాత్రం మ‌రి వీక్. అస‌లే ఆమె న‌ట‌న అంతంత మాత్రం అంటే అంకిత మ‌హారాణాతో  భారీ డైలాగ్స్ చెప్పించి ప్రేక్ష‌కుల చేత భారీ మూల్యం చెల్లించే  ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.  ఇక ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని ప‌క్క‌న పెడితే యూత్ కు న‌చ్చే అంశాలు మాత్రం `4లెట‌ర్స్` లో బోలెడున్నాయి. సో యూత్ ని టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా యూత్ కి క‌నెక్ట‌వుతుంది అన‌డంలో సందేహం లేదు. యూత్ కి క‌నెక్టైతే ప్ర‌జంట్ సినిమాలు ఓ మాదిరిగా ఆడేస్తున్నాయి కాబ‌ట్టి ఆ కోవ‌లో 4 లెట‌ర్స్ ఉండే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

 ఏ ఎక్స్ పెక్టేష‌న్స్ లేకుండా  సినిమాకు వెళితే..టు అవ‌ర్స్ బోర్ కొట్ట‌కుండా ఫోర్ లెటర్స్ ఎంట‌ర్ టైన్ చేస్తుంది. సూటిగా చెప్పాలంటేః  యూత్ కావాల్సిన బోల్డ్ లెట‌ర్స్!!

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25