English | Telugu

సినిమా పేరు:118 మూవీ
బ్యానర్:ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్
Rating:2.75
విడుదలయిన తేది:Mar 1, 2019

నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, షాలిని పాండే, నివేదా థామస్, 'ప్రభాస్' శీను, హరితేజ, డాక్టర్ భరత్ రెడ్డి, 'చమ్మక్' చంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్
మాటలు: 'మిర్చి' కిరణ్
ఎడిటర్: తమ్మిరాజు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత‌: మహేష్ ఎస్. కోనేరు
కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ద‌ర్శ‌క‌త్వం: కె.వి. గుహన్
విడుదల తేదీ: మార్చి 1, 2019

నందమూరి కల్యాణ్ రామ్ ప్రయత్నమంతా కొత్త తరహా సినిమాలు చేయాలని! కొత్త దర్శకులు, కొత్త కథలతో సినిమాలు చేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటాడు. ప్రయత్నమైతే చేస్తున్నాడు గానీ కొన్నిసార్లు ప్రయోజనం ఉండటం లేదు. పరాజయాలు పలకరిస్తున్నాయి. మరి, సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్‌ను తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం చేస్తూ హీరోగా నటించిన '118' నందమూరి కల్యాణ్ రామ్‌కి విజయాన్ని అందిస్తుందా? లేదా? రివ్యూ చదివి తెలుసుకోండి.

క‌థ‌:

గౌతమ్ (నందమూరి కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అతడికి రెండుసార్లు ఒక్కటే కల వస్తుంది. అదీ ఓ రిసార్టులో 118 రూమ్‌లో ఉన్నప్పుడు... నిండు పౌర్ణమి రోజున! గౌత‌మ్‌కి క‌ల రావ‌డానికి కారణం ఏంటి? ఆ కల నిజమా? కాదా? కలలో కనిపించే ఆద్య (నివేదా థామస్) ఎవరు? ఆమెకు ఏమైంది? కలలో ఎవరో అమ్మాయికి అపాయం జరిగితే గౌతమ్ ఏదో చేయాలని, ఆమె కోసం ఎందుకు తపన పడుతున్నాడు? ఆద్య కలను, సమస్యను పరిష్కరించే క్రమంలో అతడికి ఎవరెవరు సహాయ పడ్డారు? అసలు, ఆద్యకు అపాయం తలపెట్టింది ఎవరు? వంటి ప్రశ్నల చిక్కుముడులకు సమాధానమే సినిమా.


ఎనాలసిస్ :

మెడికల్ మాఫియా, క్లినికల్ ట్రయల్స్ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. కొన్ని సినిమాల్లో చూశారు. ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ఎక్కువశాతం యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్స్ సినిమాలే. బట్, ఫర్ ఏ ఛేంజ్‌... మెడికల్ మాఫియా, క్లినికల్ ట్రయల్స్ & ల్యూసిడ్ డ్రీమింగ్ కాన్సెప్ట్ నేపథ్యంలో కథను థ్రిల్లర్‌గా తీస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానమే '118' సినిమా. కథ మొదలైన తీరు, కథనం బావున్నాయి. ఎక్కడా 'ఇదొక మెడికల్ మాఫియా సినిమా' అనే అనుమానం ప్రేక్షకుల్లో కలగదు. తరవాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠను మైంటైన్ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ వరకూ సినిమాను ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు. అయితే.. పౌర్ణమి రోజున కల రావడం, అదే రూమ్‌లో పౌర్ణ‌మి రోజున ఉన్న‌వారికి క‌ల‌ వస్తుందని హీరో ఊహించడం, ల్యూసిడ్ డ్రీమింగ్ కాన్సెప్ట్  లాజిక్కి దూరంగా, క‌న్వీన్సింగ్‌గా అనిపించదు. పైగా, నివేదా థామస్ ఫ్లాష్‌బ్యాగ్‌ రొటీన్‌గా ఉంది. అందువల్ల, ప్రేక్షకుల్లో అప్పటివరకూ చూసిన సినిమాపై ఇంపాక్ట్ కాస్త తగ్గుతుంది. ఇంటర్వెల్ తరవాత కథలో ఉపకథలు ఎక్కువై ఉత్కంఠ తగ్గుతుంది. అయితే... ఉన్నంతలో మంచి సినిమా ఇవ్వడానికి గుహన్ ప్రయత్నించాడు. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడం వల్ల ఫ్రేమింగ్, టేకింగ్ బావున్నాయి. అతనిలో దర్శకుడికి సినిమాటోగ్రాఫర్ బాగా హెల్ప్ చేశాడు. మహేష్ కోనేరు నిర్మాణ విలువలు బావున్నాయి. కథకు అడ్డం తగలకుండా పాటలను తగ్గించాలని దర్శక, నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలి. 'శేఖర్ చంద్ర స్వరాల్లో 'చందమామే' పాట బావుంది. నేపథ్య సంగీతం కూడా కథకు తగ్గట్టు బావుంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలను చక్కగా తీశారు.

ప్లస్ పాయింట్స్:

కథ మొదలైన తీరు... కథనం!
సినిమాటోగ్రఫీ, దర్శకత్వం
పాత్రకు తగ్గట్టు కల్యాణ్ రామ్ నటన

మైనస్ పాయింట్స్:

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
ల్యూసిడ్ డ్రీమింగ్ కాన్సెప్ట్
సెకండాఫ్

నటీనటుల పనితీరు:

కల్యాణ్ రామ్ పాత్రకు తగ్గట్టు నటించారు. ఫైట్స్ లో కూడా హీరోయిజం చూపించాలని ప్రయత్నించకుండా కథకు, క్యారెక్ట‌ర్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. కల్యాణ్ రామ్ డ్రస్సింగ్ నీట్‌గా ఉంది. పాత్ర నిడివి తక్కువైనా, ఫ్లాష్ బ్యాక్ రొటీన్ అయినా... తన నటనతో నివేదా థామస్ ఆకట్టుకున్నారు. షాలిని పాండే పాత్రకు కథలో ఇంపార్టెన్స్ ఏమీ లేదు. అయితే.. 'చందమామే' పాటలో ముద్దుగా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో తన ఉనికి నిలుపుకున్నారు. ప్రవీణ్, హరితేజ, డాక్టర్ భరత్ రెడ్డి, రాజీవ్ కనకాల  తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'118'.. ఓ డీసెంట్ థ్రిల్లర్ సినిమా. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కు వెళ్లి, ల్యూసిడ్ కాన్సెప్ట్ & ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని క్షమించగలిగితే ఎంజాయ్ చేయవచ్చు. ప్రేక్షకులు సినిమాను ఒక్కసారి చూడొచ్చు.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25