English | Telugu

గుంటూరు ఎస్పీ కార్యాలయంలో కలకలం...

ఆడదాని కోసం రాజుల సైతం రాజ్యాలే కొల్పొయారు.గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓ ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ వివాదాస్పదంగా మారింది. చివరకు ఓ ఉద్యోగి ఆత్మహత్య యత్నం దాకా వ్యవహారం వెళ్లింది. అంతేనా ఇదే విషయాన్ని ఆ ఉద్యోగి పోలీస్ అఫీషియల్ గ్రూప్ లో వీడియో పోస్ట్ చేయడం కలకలం రేపింది. విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

జిల్లా ఎస్పీ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రుద్ర నాగు, జంగం నాగరాజు ఇద్దరితో ఓ ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం ఇద్దరికీ తెలియటంతో ఘర్షణ పడ్డారు. ఇళ్లకు వెళ్లి మరీ బెదిరించుకున్నారు. మహిళను వదలకపోతే బావుండదు అంటూ రుద్ర నాగును నాగరాజు బెదిరించాడు. విషయాన్ని అతని భార్య కుటుంబ సభ్యులకు చెప్పాడు. భార్యకు, తల్లికి విషయం తెలియటం.. మరోవైపు ఆ ఔట్ సోర్సింగ్ మహిళా మొహం చాటేయడంతో రుద్ర నాకు ఆత్మహత్య యత్నం చేశాడు. అంతకుముందు ఆత్మహత్యకు కారణాలపై వీడియో తీసి పోలీసుల అఫీషియల్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. రుద్ర నాగును సెల్ టవర్ లొకేషన్ ద్వారా పోలీసులు తాడేపల్లి పరిసరాల్లో ఉన్నట్టుగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ ఆఫీస్ లో గతంలోనూ ఇటువంటి ఘటనలు జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఇలాంటి ఘటనలు ఇక పై జరగకుండా ఉండాలని అధికారులు ఆదేశించారు.