English | Telugu
తల్లీ కొడుకుల న్యాయపోరాటం నాన్ స్టాప్.. జగన్ పై చెన్నై ట్రైబ్యునల్ కు విజయమ్మ
Updated : Sep 5, 2025
ఆస్తుల వ్యవహారంలో తల్లీ కొడుకుల మధ్య న్యాయపోరాటం నాన్ స్టాప్ గా సాగుతోంది. సరస్వతి పవర్ కంపెనీ వ్యవహారంలో ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ చెన్నై ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. సరస్వతి పవర్ సిమెంట్స్ వ్యవహారాలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని పేర్కొంటూ.. కుటుంబ వివాదంపై తన కుమారుడు జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేస్తే.. ఎన్సీఎల్టీ విచారించి జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొంటూ విజయమ్మ చెన్నై ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
విషయమేంటంటే.. సరస్వతి పవర్ కంపెనీ విషయంలో జగన్, భారతి విజయమ్మకు తమ వాటాలను గిఫ్ట్ డీడ్ కింద రాసిఇచ్చి డైరెక్టర్లుగా వైదొలిగారు. అయితే విజయమ్మ షర్మిలకు ట్రాన్స్ ఫర్ చేయడంతో తాము గిఫ్ట్ డీడ్ఇచ్చిన వాటాలను వెనక్కు తీసుకుంటామని కోరుతూ జగన్ ఎన్సీ ఎల్టీని ఆశ్రయిం చారు.దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ జగన్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అసలు జగన్ సరస్వతి పవర్ విషయంలో ఇంతగా పట్టుబట్టడానికి రాజకీయంగా తనను వ్యతిరేకిస్తున్న సోదరి షర్మిలకు తల్లి విజయమ్మ మద్దతు పలకడమేనని పరిశీలకులు అంటున్నారు.
కాగా ఎన్సీఎల్టీ జగన్ కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ విజయమ్మ చెన్నై ట్రైబ్యు నల్ ను ఆశ్రయించారు. దీంతో తల్లి కొడుకుల మధ్య న్యాయపోరాటం కొనసాగుతోందని అర్థమౌతోంది. ఇటీవల వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో తల్లి విజయమ్మతో జగన్ ముభావంగా ఉండటం తెలిసిందే. సరస్వతి పవర్ వాటాల విషయంలో విభేదాలే అందుకు కారణమని భావిస్తున్నారు.