English | Telugu
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై పరిశీలనకు మంత్రుల కమిటీ
Updated : Aug 30, 2025
జగన్ హయాంలో విశాఖలోని రుషి కొండకు బోడిగుండు కొట్టింది.. వేల కోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత విలాసవంతమైన ప్యాలస్ భవనాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రజాధనాన్ని వృధా చేసి మరీ నిర్మించిన ఆ ప్యాలెస్ భవనాలు ఎందుకూ పనికి రాకుండా నిరుపుయోగంగా పడి ఉన్నాయి. వాటిని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా రుషికొండ ప్యాలెస్ వినియోగంపై పరిశీలనకు మంత్రుల కమిటీని వేసింది.
మంత్రు లు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయస్వామిలతో ప్రభుత్వం కమిటీని వేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ శుక్రవారం (ఆగస్టు 29) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రుషికొండ ప్యాలెస్, భవనాలను వినియోగించే మార్గాలు, అవకాశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ నివేదిక అనంతరం రుషికొండ ప్యాలెస్, భవనాల వినియోగం విషయంలో కూటమి సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంటుంది.