English | Telugu

తల్లి, చెల్లిపై కేసులో జగన్‌కు ఊరట

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎన్‌సీఎల్‌టీలో భారీ ఊరట లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్‌ వేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. తమ వాటాలను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్‌ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది.

ఎన్‌సీఎల్‌టీ తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టు లో సవాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో తన అన్న వదిన కలిసి తమకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో రావాల్సిన వాటాలను ఇవ్వడం లేదని షర్మిల, విజయలక్ష్మి ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జగన్ స్వయంగా తన చెల్లి, తల్లిపై పిటీషన్ వేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.