English | Telugu
ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
Updated : Sep 12, 2025
నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ ధనకఢ్ , లోకసభ స్పీకర్ ఓం బిర్లా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు.
మాజీ ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.దీంతో ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలపాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తాజాగా ఆయన ఈ రోజు కార్యక్రమానికి హాజరై అందరి అనుమానాలను నివృత్తి చేశారు.