English | Telugu

అసలైన నాయకుడిగా మన్నలను పొందుతున్న హరీశ్ రావు...

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాటలు విని అందరు నివ్వెరపోతున్నారు. సిద్ధిపేట అంటే హరీశ్ రావు, హరీశ్ రావు అంటే సిద్దిపేట. అంతగా ఆయన పేరు పక్కన ఈ ఊరు చేరింది. ప్రతి రోజూ ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు అలవాటు. మంత్రిగా రాజధానిలో ఉండాల్సి వచ్చినా ఆయన దృష్టంతా తన నియోజక వర్గ ప్రజలు పైనే ఉంటుంది. అయితే ఆయనను కలిసేందుకు భారీగా ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్యా ఎక్కువ గానే ఉంటుంది. ఈ విషయంలోనే హరీశ్ రావు కాస్త ఆందోళన చెందుతుంటారు.

డబ్బు ఖర్చు పెట్టుకొని తనను కలవడానికి రావద్దని ఆదివారం తనను కలిసిన కార్యకర్తలకు సూచించారు హరీష్. ఏదైనా సమస్య ఉంటే సిద్ధిపేట్ లోనే తనను కలవాలని వారంలో నాలుగు రోజులు అక్కడే ఉంటానని భరోసా ఇచ్చారు. పొద్దున్నే ఐదు గంటలకి లేచి ఏదో ఒక బండి పట్టుకొచ్చి పని కాకపోతే చాలా వరకు నష్టపోతారు.దీంతో పైసలు వేస్ట్ పని కాకపోతే టైం వేస్ట్ మనసు నొచ్చుకుంటారు. మీరు బాధపడితే నేను బాధపడతా ఎందుకు ఇవన్నీ అంటూ కార్యకర్తలకు హరీశ్ రావు సముదాయించి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోపై నెటిజన్ లు పెద్దయెత్తున స్పందిస్తున్నారు. నాయకుడు అంటే ఇలాగే ఉండాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. హరీశ్ రావు వైఖరికి అందరు అసలైన నాయకుడని ప్రశంశిస్తున్నారు.