English | Telugu
కల్కి ఆశ్రమంలో నిర్వహించిన ఐటీ దాడుల వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు .....
Updated : Oct 22, 2019
కల్కి ఆశ్రమంల్లో గత ఐదు రోజులుగా దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు లెక్కకు మించిన ఆస్తుల్ని గుర్తించారు. సోదాల్లో ఆశ్రమాల్లో దాచిన నోట్ల కట్టలు కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలను వెలుగులోకి తీసుకువచ్చారు. చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని నలభై చోట్ల ఏక కాలంలో చేపట్టిన తనిఖీల్లో ఇవాళ్టితో ముగించారు. కల్కి ఆస్తులను ఇక్కడే కాకుండా దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఐటి అధికారులు గుర్తించారు. వీటితో పాటు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు వేల ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్టు రాబట్టారు.
ఇక వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన కల్కి, ఎనిమిది వందల కోట్ల రూపాయల పన్నులను ఎగ్గొట్టినట్లు గుర్తించారు. మొత్తం ఐదు రోజుల పాటు ఐటీ అధికారులు దాదాపు నలభై ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. సోదాలో ఇప్పటి వరకు కూడా పట్టుబడ్డటువంటి నగదు, ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఐటీ అధికారులు కొద్ది సేపటి క్రితమే మీడియాకు విడుదల చేశారు. మొత్తం ఇప్పటి వరకు కూడా వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు అలాగే నలభై కోట్లకు పైగా ప్రపంచం మొత్తం ఇండియన్ కరెన్సీకి సంబంధించిన నగదు ఇందులో ఫారిన్ కరెన్సీ కూడా ఉంది. మొత్తం కలుపుకొని అరవై కోట్ల వరకు కూడా నగదును గుర్తించారు. దాదాపు అరవై ఆరు కోట్ల నగదు ఉంది. అలాగే తొంభై కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేశారు అధికారులు. వీటి విలువ దాదాపు నూట ఐదు కోట్లు ఉంటుందని కూడా ఐటీ అధికారులు తెలిపారు. అలాగే లెక్కల్లో లేనటువంటి నగదుకు సంబంధించి దాదాపు నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలున్నట్టు దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ లు కూడా గుర్తించారు. దీంతో పాటుగా విదేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఉన్నాయి.
ఇప్పటి వరకు కూడా పట్టుబడ్డటువంటి ఇవన్నీ కూడా లెక్కలో లేనటువంటి ఆస్తులు మాత్రమే. ఇవి కాకుండా ఇప్పటికే ఐటీ చూపించినటువంటి ఆస్తులు వేరే ఉన్నాయి. ఇప్పటి వరకు పట్టుబడ్డటువంటి వందలాది కోట్ల రూపాయల నగదు కావచ్చు, బంగారం కావచ్చు వేలాది కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఐటీ అధికారులకు చూపనటువంటి లెక్కలో లేని నగదుగా మాత్రమే వెల్లడించారు. ఇప్పటి వరకు కూడా పూర్తయినటువంటి ఈ దాడుల తర్వాత ఐటీ అధికారుల వివరాలు వెల్లడించారు. దీనికి సంబంధించినటువంటి ఈ కల్కి ఆశ్రమం ప్రతినిధులు కావచ్చు, కల్కి భగవాన్ కావచ్చు వీరెవరూ కూడా ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు, జరిగినటువంటి దాడులకు సంబంధించి ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు.ఇక ఈ కేసు పై పూర్తి దర్యాప్తు కొనసాగిస్తూ మరిన్ని వివరాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు అధికారులు.