English | Telugu

చెంగాళమ్మ అమ్మవారికి ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు

ఇస్రో చైర్మన్ నారాయణన్ సూళ్లూరు పేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో మంగళవారం (జులై 29) ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీహరికోట నుండి నేరుగా చెంగాళమ్మ ఆలయానికి చేసురుకున్న ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. దర్శనానంతరం ఇస్రో చైర్మన్మా ట్లాడుతూ షార్ నుండి జరిగే రాకెట్ ప్రయోగం విజయవంతకావాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. భవిష్యత్ లో ఇస్రో అధునాతన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరికొత్త తరహాలో ఉపగ్రహాలను నింగిలోకి పంపుతామనిఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.