English | Telugu

విశాఖలో కాల్పుల కలకలం

విశాఖపట్నంలో కాల్పుల కలకలం సృష్టించాయి. నగరంలోని చిలకపేట సమీపంలో నాటుతుపాకితో ఓ దుండగుడు ఓ వ్యక్తిపై కాల్పులకు తెగపడ్డాడు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల కారణంగానే ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

చిలకపేట వద్ద చేపల రాజేశ్ అనే వ్యక్తిపై దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు తెగబడిన వ్యక్తిని సస్పెన్షన్ లో ఉన్న కానిస్టేబుల్ గా గుర్తించారు.