English | Telugu

కారు ప్రమాదంలో నలుగురు హాకీ ప్లేయర్లు మృతి...

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. హైవే నెంబర్ అరవై తొమ్మిది లో వేగంగా వెళుతున్న క్రమం లో వారు ప్రయాణిస్తున్న కారు పల్టీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఏడుగురు ఉన్నట్టుగా సమాచారం, వారిలో నలుగురు చనిపోగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు.

ఈ ప్రమాదం మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ దగ్గర జరిగింది. అయితే వీరంతా హాకీ క్రీడాకారులని సమాచారం, వీరంతా ఈ రోజు జరిగే ధ్యాన్ చంద్ ట్రోఫీ లో పాల్గొనాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో వారు స్టేడియానికి చేరతారనగా ఈ ప్రమాదం జరిగింది, చనిపోయిన వారంతా జాతీయ స్థాయి ప్లేయర్లు అని పోలీసులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మృతుల వారి కుటుంబాలకు సమాచారమిచ్చామని పోలీసులు తెలిపారు.

ప్రమాదానికి కారణం అతివేగమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతివేగం వల్ల కారు అదుపు తప్పడంతో పల్టీలు కొట్టి రోడ్ పక్కకు వెళ్ళి పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్లేయర్లు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా జాతీయ స్థాయి క్రీడాకారులు కావడంతో అంతా విషాద చాయలు అములుకున్నాయి. జాతీయ స్థాయి క్రీడాకారులను కోల్పోవడంతో భారతదేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సంఘటన తెలుసుకున్న మృతుల తల్లి తండ్రులు తీవ్ర అవేదనకు గురి అవుతున్నారు. క్రీడా సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.