English | Telugu
కన్యాకుమారి ముంబై ఎక్స్ ప్రెస్ లో మంటలు
Updated : Jul 27, 2025
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కన్యాకుమారి నుంచి ముంబై వెళుతున్న రైలు అన్నమయ్య జిల్లా చేరుకున్న సమయంలో ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. కన్యాకుమారి- ముంబై ఎక్స్ ప్రెస్ లోని ఓ ఏసీ బోగీలు మంటలు చెలరేగడాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే రైలును నందలూరు స్టేషన్ సమీపంలో నిలిపివేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వారు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అదుపు చేసిన తరువాత రైలు యథా ప్రకారం ప్రయాణాన్ని సాగించింది. సాంకేతిక లోపంతోనే ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.