English | Telugu

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అస్వస్థత

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం (సెప్టెంబర్ 30) రాత్రి ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఖర్గే వయస్సు 83 ఏళ్లు.కాగా ఖర్గే వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారనీ, ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వైద్యులు తెలిపారు. కాగా ఖర్గే త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. ఖర్గే అస్వస్థతకు గురైన సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు ఆయనను ఫోన్ లో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.