English | Telugu
అమరావతిలో కలెక్టర్ల సదస్సు
Updated : Sep 15, 2025
అమరావతిలో సోమవారం (సెప్టెంబర్ 15) నుంచి రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ సదస్సు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సదస్సులో మాట్లాడనున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఒక్కో కార్యదర్శి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఐదు స్లైడ్లకు మించకూడదని ఇప్పటికే సూచించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొంటారు.