English | Telugu
కొత్త రూపం దాల్చిన జగిత్యాల...
Updated : Oct 31, 2019
జగిత్యాల బల్దియాను పూర్తిగా ప్రక్షాళన చేశారు. పాలక వర్గం గడువు ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారుల పాలనలో నడుస్తున్న బల్దియాలలో ఉద్యోగులు, కార్మికులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సమయానికి రావడమే కాక ఫైల్ ను వెంటనే క్లియర్ చేస్తున్నారు. సాయంత్రం అవసరమైతే గంట ఎక్కువ సేపు ఉంటున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొన్నటి దాకా ఎక్కడి పనులు అక్కడే ఉండేవి. పనుల పరిష్కారం పట్ల అధికారులు పెద్దగా శ్రద్ధ చూపెట్టేవారు కాదు. కొంత మంది వీఐపీలు కాకపోయినా వాళ్లింట్లో మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి పని చేసేవారు. రోడ్లకు ఇరువైపులా చెత్త ఉండేది. మరోవైపు మున్సిపల్ అంటేనే పైరవీకారులు రాజ్యమేలారు.
ప్రత్యేకాధికారుల పాలనలో మున్సిపల్ సిబ్బంది పని తీరు మార్చుకున్నారు. సీసీ కెమెరాలు అమర్చిన తర్వాత ఎవరి పనివారు చేస్తున్నారు. సిబ్బంది పని వేళలను చూసేందుకు బయో మెట్రిక్ అమలులోకి తెచ్చారు. దీంతో సిబ్బందిలో మార్పు వచ్చింది. బల్దియా కార్యాలయంలో అమర్చిన సీసీ టీవీలను కలెక్టర్ కార్యాలయం క్యాంప్ ఆఫీసుతో పాటు ఇన్ చార్జ్ కమిషనర్ ఆర్డీఒ నరేందర్ మొబైల్ కు అనుసంధానం చేశారు. దీంతో వాళ్లు ఎక్కడున్న సీసీ టీవీ చూస్తూ బల్దియాపై ఓ కన్ను వేస్తున్నారు. అంతేకాదు వీఐపీ ఇళ్లల్లో పని చేస్తున్న అరవై మంది సిబ్బందిని వెనక్కి పిలిచారు.
జగిత్యాల పురపాలక సంఘం యొక్క పదవీ కాలం ముగిసిన తరువాత గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకాధికారిగా ముఖ్యంగా శానిటేషన్ ని బాగుపరచాలి అనే నేపధ్యంలో పని చేశారంటూ మరియు డ్రెయిన్స్ కూడా ఎక్కువ పూడుకుపోవటం వల్ల అనే సమస్యలు వస్తాయి కాబట్టి శానిటేషన్ మీద దృష్టిపెట్టినట్లు కలక్టర్ వెల్లడించారు.జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో నడిచే దుకాణాలూ వాటికి వచ్చే ఆదాయం, హోర్డింగ్ ల ద్వారా వచ్చే ఆదాయంపై లెక్కలు తీశారు. వందకు పైగా దుకాణాల లెక్క లు లేవని తేలింది. వాటి పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు ఇది ఇలాగే ఉంటుందని అధికారులు అంటున్నారు.