English | Telugu
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
Updated : Jul 26, 2025
గోవా గవర్నర్ గా అశోకగజపతి రాజు శనివారం (జులై 25) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో అశోక్ గజపతిరాజుతో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అంతకు ముందు శుక్రవారం గోవాకు చేరుకున్న అశోకగజపతి రాజు, ఆయన కుటుంబ సభ్యులకు గోవా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా అశోకగజపతి రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితులు, బంధువులు, పెద్ద సంఖ్యలో టీటీడీ శ్రేణులూ కూడా గోవా చేరుకున్నాయి.