English | Telugu
ఏపీలో మళ్లీ పునరుద్ధరణ లోకి రానున్న ఏబీఎన్ ప్రసారాలు...
Updated : Oct 18, 2019
ఏపీలో ఏబీఎన్ ప్రసారాలను నిలిపివేసింది జగన్ ప్రభుత్వం. అప్పటి నుంచి ఛానల్ అధికారులు, ప్రజలు ట్రాయ్ కు ఎన్నో సార్లు పునరుద్దరించాలని ఫిర్యాదులు చేపట్టారు.ఎట్టకేలకి ఏబీఎన్ ప్రసారాలను రెండ్రోజుల్లో పునరుద్ధరించాలని ఏపీ ఫైబర్ నెట్ కు టిడి శాట్ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ముందు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయనందున ఏపీ ఫైబర్ నెట్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని టిడి శాట్ స్పష్టం చేసింది. ఎంత జరిమానా విధించాలి అనేది ఇరవై రెండవ తేదీన నిర్ణయిస్తామని టిడి శాట్ ప్రకటించింది.
ఏబీఎన్ ఛానళ్ ప్రసారాల నిలిపివేతపై ఇవాళ టిడి శాట్ లో విచారణ జరిగింది. అయితే ఈ నెల ఇరవై రెండు కల్లా ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరిస్తామని టిడి శాట్ కు ఏపీ ఫైబర్ నెట్ తెలిపింది. గతంలో ఏ నెంబర్ లో అయితే ఛానల్ ఇచ్చారో అదే స్థానం నుంచి ప్రసారాలను ఇవ్వాలని ఇంతకు ముందే టిడి శాట్ ఆదేశించింది. సాంకేతిక సమస్యలంటూ సాకులు చెప్పొద్దని ఇప్పటికే హెచ్చరించింది. ఆదేశాలు పాటించకపోతే ఎంఎస్వోలు ఏపీ ఫైబర్ నెట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఏపీలో సిటీ కేబుల్ తో పాటు ఏపీ ఫైబర్ నెట్ లో ఏబీఎన్ ఛానళ్ ప్రసారాలు నిలిపివేశారు. అప్పట్నుంచీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జర్నలిస్టు సంఘాలతో పాటుగా ప్రజలు కూడా ఏబీఎన్ ఛానల్ ఇవ్వాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రసారాలు వెంటనే పునరుద్దరించాలని వేలాది సంఖ్యలో ట్రాయ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా ఏపీలో ఏబీఎన్ ప్రసారాలు ఇవ్వాల్సిందేననీ టిడి శాట్ స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మీడియాపై ఆంక్షలు విధించాలి అనుకోవడం జగన్ నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్. ఇలాంటి పనులు మానుకోవాలని ఆయన జగన్ కు హితవు పలికారు.ఇక సర్కార్ దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.