English | Telugu
తండ్రీకూతుళ్ళుగా బాలయ్య, సాయిపల్లవి?
Updated : Mar 19, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణ, డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. కూతురి కోసం పోరాడే ఓ తండ్రి కథతో తాజాగా బాలయ్యను సంప్రదించారట ఓ నూతన దర్శకుడు. కథ, తన పాత్ర బాగా నచ్చడంతో బాలకృష్ణ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించారట. తండ్రి పాత్ర అయినప్పటికీ నటనకు బాగా స్కోప్ ఉన్న చిత్రం కావడంతో.. రివెంజ్ డ్రామాగా సాగే ఈ మూవీకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక బాలయ్యకి జోడీగా మీనా లేదా రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్ నటించే ఈ సినిమాలో.. కూతురి పాత్ర కోసం సాయిపల్లవితో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
మరి.. తండ్రీకూతుళ్ళ పాత్రల్లో బాలయ్య, సాయిపల్లవి ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.