English | Telugu
వినాయక్ డైరెక్షన్ లో కర్ణన్ రీమేక్!!
Updated : Jun 12, 2021
గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ వీవీ వినాయక్ స్పీడ్ ఈ మధ్య తగ్గిందనే చెప్పాలి. అయితే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం వినాయక్ తో వరుస చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. గతంలో ఎందరో హీరోలకు కమర్షియల్ హిట్లు ఇచ్చిన వినాయక్.. తన కెరియర్ గ్రాఫ్ కి బూస్ట్ ఇస్తాడని భావిస్తున్నాడు. అందుకే ఇప్పటికే వినాయక తో ఓ రీమేక్ సినిమా చేస్తున్న శ్రీనివాస్.. మరో రీమేక్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది.
2005 లో ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'ఛత్రపతి' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని హిందీలోకి రీమేక్ చేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు బెల్లకొండ శ్రీనివాస్. ఛత్రపతి హిందీ రీమేక్ ను వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది కానీ కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ మూలంగా షూటింగ్ నిలిచిపోయింది. దీనికితోడు హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ కూడా వర్షాల కారణంగా దెబ్బతింది. దీంతో మళ్లీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. దీంతో మరో రీమేక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట బెల్లంకొండ.
తమిళంలో ఇటీవల హిట్ అయిన ‘కర్ణన్’ రీమేక్ హక్కులను బెల్లకొండ దక్కించుకున్నాడు. ఛత్రపతి హిందీ రీమేక్ స్టార్ట్ అవ్వడానికి కాస్త సమయం పట్టేలా ఉండటంతో.. ఈలోపు కర్ణన్ రీమేక్ ఫినిష్ చేయాలని చూస్తున్నాడట. అయితే ఈ రీమేక్ బాధ్యతను కూడ వినాయక్ భుజాల మీదే పెట్టారని టాక్ వినిపిస్తోంది. వినాయక్ కూడా ఈ రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం.