English | Telugu

సోష‌ల్ మీడియా టాక్: విజయ్‌కి రూ.50 కోట్ల పారితోషిక‌మా?

కోలీవుడ్ స్టార్, ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ తో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు ఓ భారీ బ‌డ్జెట్ మూవీని ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న బేన‌ర్ లో `మున్నా`, `బృందావ‌నం`, `ఎవ‌డు`, `మ‌హ‌ర్షి` వంటి చిత్రాల‌ను రూపొందించిన వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించ‌నున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన బ‌డ్జెట్, విజ‌య్ రెమ్యూన‌రేష‌న్ గురించి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 170 కోట్ల బ‌డ్జెట్ తో ప్లాన్ చేస్తున్నార‌ట రాజు. ఇక విజ‌య్ కి అక్ష‌రాలా రూ.50 కోట్ల పారితోషికాన్ని ఇస్తున్న‌ట్లు బ‌జ్. త‌మిళ‌నాట విజ‌య్ సినిమాల‌కి వ‌సూళ్ళ ప‌రంగా ఢోకా ఉండ‌దు కాబ‌ట్టే ఈ బైలింగ్వ‌ల్ మూవీకి బ‌డ్జెట్, విజ‌య్ రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో రాజు రాజీ ప‌డ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

ఇదిలా ఉంటే.. విజ‌య్ ప్ర‌స్తుతం నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ చేస్తున్నారు. `విజ‌య్ 65` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తోంది.