English | Telugu

క్రికెట్ కోచ్ గా సూప‌ర్ స్టార్?

2003 నాటి సంక్రాంతి విజేత `ఒక్క‌డు`లో క‌బ‌డ్డీ ఆట‌గాడిగా క‌నిపించి అల‌రించారు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు. అంతేకాదు.. ఓ మెమ‌ర‌బుల్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ఆ త‌రువాత మ‌ళ్ళీ స్పోర్ట్స్ డ్రామా జోలికి వెళ్ళ‌ని మ‌హేశ్.. త్వ‌ర‌లో మ‌రో క్రీడా నేప‌థ్య చిత్రం చేయ‌నున్నార‌ట‌. అయితే, ఈసారి క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో మూవీ ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో మ‌హేశ్ మ‌రో చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. `స‌ర్కారు వారి పాట‌`, త్రివిక్ర‌మ్ డైరెక్టోరియ‌ల్ త‌రువాత మ‌హేశ్ చేయ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని.. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడ‌ట అనిల్. అంతేకాదు.. ఇంత‌వ‌ర‌కు మ‌హేశ్ పోషించ‌ని క్రికెట్ కోచ్ పాత్ర‌ని డిజైన్ చేసుకున్నాడ‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం `ఎఫ్ 3` చేస్తున్నాడు. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ లో విక్ట‌రీ వెంక‌టేశ్, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.