English | Telugu

అతిలోక సుంద‌రికే టోక‌రానా??

పులి సినిమాలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రీ ఎంట్రీ ఇచ్చింది ఆనాటి అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి. ఈ సినిమా కోసం అక్ష‌రాలా రూ.5 కోట్లు పారితోషికం తీసుకొంద‌న్న వార్త‌లొచ్చాయి. అయితే పులి వ‌ల్ల శ్రీ‌దేవికి, శ్రీ‌దేవి వ‌ల్ల పులికీ ఒరిగిందేం లేకుండా పోయింది. ఈ సినిమాలో శ్రీ‌దేవి ముస‌లి స్వ‌రూపం విశ్వ‌రూపంలో ద‌ర్శ‌నమిచ్చింద‌ని స్వ‌యంగా శ్రీ‌దేవి అభిమానులే నిరుత్సాహ ప‌డ్డారు. దాంతో.. పులి ఓ చేదు జ్ఞాప‌కంగా మిగిలింది శ్రీ‌దేవికి. ఇప్పుడు మ‌రో రూపంలో పులి సినిమా క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ సినిమా నిర్మాత‌ల‌కు త‌న‌కు పారితోషికం ఎగ్గొట్టార‌ని.. త‌మిళ ఫిల్మ్ చాంబ‌ర్‌లో పిర్యాదు చేసింది శ్రీ‌దేవి. చివ‌ర్లో ఇస్తామ‌న్న రూ.50 ల‌క్ష‌లు ఎగ్గొట్టార‌ని, ఎన్నిసార్లు అడిగినా స‌మాధానం ఇవ్వ‌డం లేద‌ని, త‌క్ష‌ణం త‌న పారితోషికం ఇప్పించాల‌ని శ్రీ‌దేవి కాస్త గ‌ట్టిగానే అడుగుతోంది. నిర్మాత‌లు మాత్రం.. ఆమె అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చామ‌ని - ప్ర‌తీ రోజూ.. ఆమె వ్య‌క్తిగ‌త ఖ‌ర్చే కొన్ని ల‌క్ష‌ల్లో ఉండేద‌ని, పారితోషికం ఇచ్చినా - సౌక‌ర్యాల పేరుతో ఎగ‌స్ట్రాగా మ‌రికొన్ని ల‌క్ష‌లు బాదేసింద‌ని నిర్మాత‌ల వాద‌న‌. మ‌రి ఈ కేసు చివ‌రికి ఏమ‌వుతుందో??