English | Telugu

'అఖిల్' పై కాన్ఫిడెన్స్ లేదా?

సినిమా అంటే ఇదిరా అని అభిమానులంతా గ‌ర్వంగా చెప్పుకొనే క‌థ‌తో ఎంట్రీ ఇస్తా - అంటూ అక్కినేని అభిమానుల‌కు మాట ఇచ్చాడు అఖిల్‌. వినాయ‌క్ తో సినిమా ఓపెనింగ్ రోజున శిల్ప‌క‌ళావేదిక సాక్షిగా.. అఖిల్ చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు అఖిల్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతోంది. కానీ ఆఖిల్‌లో మునుప‌టి కాన్పిడెన్స్ మాత్రం క‌నిపించ‌డం లేదు.

అఖిల్‌లో ఏంటి..??? వినాయ‌క్ కూడా అంతే మూడీగా ఉన్నాడు. `నాలుగైదు సినిమాల‌కు స‌రిప‌డా ప్రెజెర్ పెట్టేశారు` అంటూ మీడియా ముందే నోరు జారాడు. అంటే `ఈ సినిమా కోసం చాలా ఒత్తిడికి గురి చేశారు.. ప‌లితం అటూ ఇటూ అయినా.. అది నా త‌ప్పు కాదు` అని చెప్ప‌క‌నే చెప్పేశాడా?? అంటూ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో సెటైర్లు వేసుకొంటున్నారు.

అఖిల్ అయితే `హిట్టు కొడ‌తాం` అనే మాట గ్యారెంటీగా చెప్ప‌లేక‌పోతున్నాడు. `ఓ మంచి ప్ర‌య‌త్నం చేశాం.. న‌చ్చుతుంద‌నే నా నమ్మ‌కం` అంటూ దేవుడిపై భ‌రోసా వేస్తున్నాడు. క‌థ కంటే వినాయ‌క్‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే సినిమా ఒప్పుకొన్నా.. అంటూ మాట మారుస్తున్నాడు. మొత్తానికి.. ఈ సినిమాపై అటు అఖిల్‌, ఇటు వినాయ‌క్ ఇద్ద‌రికీ న‌మ్మ‌కాల్లేన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో??