English | Telugu

'లైగ‌ర్‌'కు బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు?

పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న 'లైగ‌ర్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతోన్న 'లైగ‌ర్' పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న‌ది. అన‌న్యా పాండే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు వ‌చ్చింది. విజ‌య్‌, కొంత‌మంది ఫైట‌ర్ల‌తో యాక్ష‌న్ సీన్లు తీయ‌డానికి అమెరికా వెళ్లేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. క‌ర‌ణ్ జోహార్‌కు చెందిన ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌, చార్మి సొంత బ్యాన‌ర్ పూరి క‌నెక్ట్స్ సంయుక్తంగా లైగ‌ర్‌ను నిర్మిస్తున్నాయి.

కాగా, ఈ సినిమాకు బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌ట్లు లేటెస్ట్‌గా ఆన్‌లైన్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ మూవీలో మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియ‌న్ మైక్ టైస‌న్ కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న రాక‌తో బ‌డ్జెట్ అనూహ్యంగా పెరిగిపోయిన‌ట్లు తెలియ‌వ‌చ్చింది. మొద‌ట ఈ క్యారెక్ట‌ర్‌ను ఇండియ‌న్ యాక్ట‌ర్‌తోటే చేయించాల‌నుకున్నారు. కానీ టైస‌న్ వ‌స్తే, మూవీకి మ‌రింత క్రేజ్ వ‌స్తుంద‌ని పూరి భావించాడు.

ఇప్ప‌టికే కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా షూటింగ్‌లో జాప్యం జ‌ర‌గ‌డంతో బ‌డ్జెట్ పెరిగింది. ఇప్పుడు టైస‌న్ వ‌ల్ల ఆ బ‌డ్జెట్ ఇంకా పెరిగిందంటున్నారు. దీంతో వీలైనంత ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేయాల‌ని పూరి, క‌ర‌ణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌ర‌ల్‌గా ఏ సినిమానైనా ఫాస్ట్‌గా తీసేస్తాడ‌ని పూరికి పేరుంది. అలాంటిది 'లైగ‌ర్‌'కు ఎప్పుడూ తీసుకోనంత టైమ్ తీసుకుంటున్నాడు పూరి. బ‌డ్జెట్ పెర‌గ‌డంతో సినిమా థియేట్రిక‌ల్‌, డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ కూడా పెంచేశార‌ని వినిపిస్తోంది.

మ‌రోవైపు హిందీ వెర్ష‌న్‌కు విజ‌య్ డ‌బ్బింగ్ మొద‌లుపెట్టాడు. హైద‌రాబాదీ హిందీలో మంచి ప‌ట్టు వుండ‌టంతో అత‌నికి లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ ఏమీ ఎదురు కాలేదు. ఈ మూవీలో అత‌ను బాక్స‌ర్‌గా న‌టిస్తుండ‌గా, అత‌ని ప్రేయ‌సిగా అన‌న్య క‌నిపించ‌నున్న‌ది.