English | Telugu
రజనీకాంత్ చెల్లెలిగా నటించినందుకు కీర్తి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇదే!
Updated : Nov 10, 2021
'మహానటి' ఫేమ్ కీర్తి సురేశ్ సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ డిమాండ్ ఉన్న యాక్ట్రెస్. కమర్షియల్ మూవీస్‌లో గ్లామరస్ రోల్స్‌తో పాటు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తూ నటిగా తనలో వర్సటాలిటీ ఉందని ఆమె నిరూపించుకుంది. వీటితో పాటు హీరో చెల్లెలి పాత్రలు చేయడానికి కూడా ఆమె రెడీ అంటోంది. మొదట 'అణ్ణాత్త'లో సూపర్‌స్టార్ రజనీకాంత్ చెల్లెలిగా నటించిన ఆమె, ఇప్పుడు 'భోళా శంకర్'లో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోంది.
కాగా, 'అణ్ణాత్త' (తెలుగులో 'పెద్దన్న')లో రజనీ చెల్లెలి పాత్రలో నటించడానికి ఆమె భారీ రెమ్యూనరేషన్ అడగగా నిర్మాతలు ఓకే చెప్పి, ఆ అమౌంట్ చెల్లించారు. కోలీవుడ్‌లో వినిపిస్తోన్న ప్రచారం ప్రకారం ఆమె ఏకంగా రూ. 2 కోట్లు అందుకుంది! 'అణ్ణాత్త' కథ ప్రధానంగా కీర్తి నటించిన పాత్ర చుట్టూనే నడుస్తుంది. అందుకే కాల్షీట్లు కూడా ఎక్కువ కేటాయించింది. ఆమెకు సౌత్ ఇండియా అంతా మంచి ఇమేజ్ ఉండటంతో నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
సందర్భవశాత్తూ కీర్తి తల్లి మేనక 1981లో వచ్చిన తమిళ ఫిల్మ్ 'నేట్రికన్'లో రజనీకాంత్ సరసన నటించారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో సెట్స్‌పై రజనీ ఎనర్జీని చూసి చాలా ఆశ్చర్యపోయానని కీర్తి చెప్పింది. 'అణ్ణాత్త' తమిళనాట భారీ కలెక్షన్లు సాధిస్తుంటే, తెలుగు వెర్షన్ 'పెద్దన్న' డిజాస్టర్ అయింది.
ఆమె తెలుగు సినిమా 'గుడ్‌లక్ సఖి' నవంబర్ 26న విడుదలకు రెడీ అవుతోంది. నగేశ్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆమె జోడీగా ఆది పినిశెట్టి నటించగా, జగపతిబాబు షూటింగ్ కోచ్‌గా కీలక పాత్ర చేశారు. ఇక సూపర్‌స్టార్ మహేశ్ సరసన నాయికగా కీర్తి నటిస్తోన్న 'సర్కారువారి పాట'ను 2022 ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు.