English | Telugu
నితిన్‌తో మరోసారి?
Updated : May 26, 2021
`భీష్మ` చిత్రంతో యూత్ స్టార్ నితిన్ కి మెమరబుల్ హిట్ ఇచ్చాడు యువ దర్శకుడు వెంకీ కుడుముల. `అ ఆ` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ట్రాక్ తప్పిన నితిన్ కి.. `భీష్మ` విజయం నూతనోత్తేజాన్ని ఇచ్చింది. అయితే, `భీష్మ` అనంతరం వచ్చిన `చెక్`, `రంగ్ దే` చిత్రాలతో మళ్ళీ ఫెయిల్యూర్స్ బాట పట్టిన నితిన్.. త్వరలో `భీష్మ` దర్శకుడు వెంకీ కుడుములతో మరో సినిమా చేయబోతున్నాడట. ఇటీవల దీనికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు సాగాయని.. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని టాక్.
కాగా, ప్రస్తుతం నితిన్ `మాస్ట్రో` చేస్తున్నాడు. బాలీవుడ్ సెన్సేషన్ `అంధాధున్` ఆధారంగా రూపొందుతున్న ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ని `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`, `ఎక్స్ ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నితిన్ కి జంటగా `ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేశ్ నటిస్తుండగా.. నెగటివ్ రోల్ లో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేయనుంది. మహతి స్వరసాగర్ బాణీలు అందిస్తున్నాడు. జూన్ 11న విడుదల కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడనుంది.