English | Telugu
'కంచె' బిజినెస్ జరిగిందా? లేదా?
Updated : Sep 19, 2015
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తీసిన సినిమాలన్నింటికీ బీభత్సమైన పేరు వచ్చింది. గమ్యం నుండి కృష్ణం వందే జగద్గురుమ్ వరకు సినిమాలన్నీ అదిరిపోయాయ్ అన్నారు. కానీ అసలు డబ్బుల మాత్రం రాలేదు. కమర్షియల్ సక్సెస్ మాత్రం లేదు. అందుకే అద్భుతమైన విజువల్స్ చూపించినా.. సీతారామ శాస్ర్తి ఒక తరాన్ని కదిలించే సాహిత్యం అందించినా.. ఎవరూ ఎన్నుకోని రెండవ ప్రపంచం నాటి కథను వండివార్చినా.. అబ్బే ఇంతవరకు కంచె సినిమాకు సరైన ప్రీ-రిలీజ్ బిజినెస్ మాత్రం కాలేదట. పెట్టుబడి ఎంత పెట్టాడో తెలియదు కాని.. ఒక 30 వరకు అయ్యుంటుందని ఒక అంచనా. అదంతా రికవర్ చేయాలంటే క్రిష్ కంచె సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాల్సిందే. లేకపొతే కష్టమేనని ట్రేడ్ వర్గాల టాక్.