English | Telugu

తార‌క్‌తో ఉపేంద్ర‌?

ఫ్యాక్ష‌న్ స‌బ్జెక్ట్ 'అర‌వింద స‌మేత‌'తో స‌క్సెస్ చూసిన యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త చిత్రానికి భిన్నంగా ఈ సారి పొలిటిక‌ల్ డ్రామాతో ఈ కాంబో సంద‌డి చేయ‌నుంద‌ని టాక్. 'అయిన‌ను పోయి రావలె హ‌స్తిన‌కు' అనే టైటిల్ ప్ర‌చారంలో ఉన్న ఈ సినిమాని య‌న్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి నుంచి ఈ మూవీ ప‌ట్టాలెక్కుతుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ ప్ర‌ధాన పాత్ర‌లో క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర క‌నిపిస్తార‌ని వినికిడి. ఓ రాజ‌కీయ నాయకుడిగా ఆయ‌న పాత్ర ఉంటుంద‌ని.. సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలుస్తుంద‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే జూనియ‌ర్ ఎన్టీఆర్ 30లో ఉపేంద్ర చేరిక‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. తార‌క్ తో ఉపేంద్ర‌కి ఇదే మొద‌టి సినిమా కాగా.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' వ‌చ్చింది. మ‌రి.. తార‌క్‌, ఉపేంద్ర కాంబినేష‌న్ సీన్స్ ఏ స్థాయిలో అల‌రిస్తాయో చూడాలి.