English | Telugu

ఆయ‌న‌ స‌మంత‌ని వ‌ద‌ల‌డా..??

స‌మంత‌, త్రివిక్ర‌మ్‌ల గురించి అప్ప‌ట్లో ర‌క‌ర‌కాల పుకార్లు వ‌చ్చాయి. దానికి బ‌లం చేకూరుస్తూ త్రివిక్ర‌మ్ త‌న సినిమాల్లో క‌థానాయిక‌గా స‌మంతనే తీసుకొనేవాడు. స‌న్నాఫ్ స‌త్యమూర్తి, అత్తారింటికి దారేది, అ.ఆ సినిమాల్లో స‌మంత‌నే క‌థానాయిక‌. అ.ఆ అయితే స‌మంత కోస‌మే తీశాడ‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. స‌మంత -చైతూల వివాహం నిశ్చ‌య‌మ‌య్యాక స‌మంత సినిమాలు త‌గ్గించుకొంటుంద‌ని, త్రివిక్ర‌మ్ కాంపౌండ్‌కు దూరంగా ఉంటుంద‌ని భావించారంతా. అయితే.. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. త్రివిక్ర‌మ్‌తో స‌మంత మ‌రో సినిమా చేయ‌బోతోంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో వ‌ప‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. దేవుడే దిగి వ‌చ్చినా.. అనే టైటిల్ ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. క‌థానాయిక‌గా స‌మంత‌ని ఎంచుకొన్నార‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే త్రివిక్ర‌మ్ - స‌మంత‌ల కాంబోలో ఇది 4వ సినిమా. అంటే.. వీరిద్ద‌రి బంధం ఇంకా స్ట్రాంగాతి స్ట్రాంగ్ అవ్వ‌బోతోంద‌న్న‌మాట‌. ఈసారి... ఇంకెన్ని పుకార్లు వినిపిస్తాయో చూడాలి.