English | Telugu

డైరెక్ట‌ర్‌తో గొడ‌వ ప‌డుతున్న గోపీచంద్‌?

యాక్ష‌న్ హీరోగా గోపీచంద్‌కి మంచి పేరుంది. హిట్లూ ద‌క్కాయి. అత‌ని సినిమా హిట్ట‌యితే.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ల‌నే రాబ‌డుతుంది. నిర్మాత‌లూ సేఫ్ అయిపోతారు. అయితే.. అలాంటి గోపీచంద్‌కి బ్యాడ్ టైమ్ న‌డుస్తోందిప్పుడు. లౌక్యం మిన‌హాయిస్తే... అంత‌కు ముందొచ్చిన సినిమాలు, ఆ త‌ర‌వాత వ‌చ్చిన సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓ హిట్టు కొట్టాల్సిందే. ఈ ద‌శ‌లో బి.గోపాల్‌తో సినిమా మ‌ధ్య‌లో ఆగిపోయింది. ఆ సినిమా నాలుగేళ్లుగా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీసి, రిపేర్లు చేయ‌డం మొద‌లెట్టారు. మ‌రోవైపు ఆక్సిజ‌న్ సినిమా కూడా ఆగిపోయింది. ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాలు ఒక ఎత్త‌యితే.. ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ‌కూ గోపీచంద్‌కూ మ‌ధ్య తేడాలు రావ‌డం మ‌రో ఎత్తు. జ్యోతికృష్ణ టేకింగ్‌, మేకింగ్‌ల‌పై ఏమాత్రం సంతృప్తిగా లేని గోపీచంద్ అత‌నితో గొడ‌వ ప‌డి.. షూటింగ్‌కి హ్యాండిచ్చాడ‌ని తెలుస్తోంది. నిర్మాత ఏఎం ర‌త్నం మాత్రం గోపీచంద్‌ని బుజ్జ‌గించే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ద‌స‌రాకి రావ‌ల్సిన ఈ సినిమా ఈ యేడాదైనా వ‌స్తుందో, రాదో అన్న అనుమానాలు నెల‌కొన్నాయి. ఇలాగైతే గోపీచంద్ కెరీర్ ఏం కావాలి?