English | Telugu

వ‌న్స్ మోర్.. బాల‌య్య‌, త్రిష‌?

గ‌త కొంత‌కాలంగా త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనే న‌టిస్తూ వ‌స్తోంది చెన్నైపొన్ను త్రిష‌. తెలుగులో ఆమె చివ‌రిసారిగా క‌నిపించిన సినిమా `నాయ‌కి`. 2016లో విడుద‌లైన ఈ బైలింగ్వ‌ల్ కామెడీ హార‌ర్ త‌రువాత‌.. మ‌రే తెలుగు చిత్రంలోనూ త్రిష న‌టించ‌లేదు. వాస్త‌వానికి మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌`లో కాజ‌ల్ అగ‌ర్వాల్ కంటే ముందు త్రిష ఎంపికైనా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో త్రిష నాయిక‌గా ఎంపికైంద‌ని టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. క‌థానుసారం.. ఇందులో ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌ముంద‌ని.. అందులో ఒక‌రిగా త్రిష‌ని ఎంపిక చేశార‌ని అంటున్నారు. కేవ‌లం గ్లామ‌ర్ కే ప‌రిమితం కాకుండా అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర కావ‌డంతో త్రిష కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే త్రిష ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ఇదివ‌ర‌కు త్రిష‌.. బాల‌య్య‌కి జంట‌గా `ల‌య‌న్` (2015)లో న‌టించింది. అలాగే, గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేసిన `బాడీగార్డ్` (2012)లోనూ త‌నే మెయిన్ హీరోయిన్. ఇన్నాళ్ళ‌కు ఈ ఇద్ద‌రితోనూ రెండో సినిమా చేసే అవ‌కాశం వ‌రించ‌డం విశేషం.