English | Telugu

మ‌హేశ్ చిత్రంలో శిల్పా శెట్టి పాత్ర అదేనా?

ప‌ద‌కొండేళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మించ‌నున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు ఈ నెల 31న సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రారంభం కానున్నాయ‌ని టాక్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో నిన్న‌టి త‌రం అందాల తార‌ శిల్పా శెట్టి టాలీవుడ్ లో రి-ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతున్న విష‌యం విదిత‌మే. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో మ‌హేశ్ కి పిన్ని పాత్ర‌లో శిల్ప క‌నిపిస్తుంద‌ట‌. అంతేకాదు.. నిడివి త‌క్కువే అయినా చాలా శ‌క్తిమంతంగా ఈ పాత్ర ఉంటుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ రానున్న‌ది.

కాగా, `#SSMB 28` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కనున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో మ‌హేశ్ కి జంట‌గా ఇద్ద‌రు క‌థానాయిక‌లు క‌నిపించ‌బోతున్నార‌ని.. వారిలో ఒక‌రిగా బాలీవుడ్ బ్యూటీ న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అలాగే నిధి అగ‌ర్వాల్ సెకండ్ లీడ్ రోల్ చేయ‌బోతున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా, త్రివిక్ర‌మ్ గ‌త రెండు చిత్రాల‌కు బాణీలు అందించిన యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ ఈ సినిమాకీ స్వ‌రాలు స‌మ‌కూర్చనున్నారు.