English | Telugu

టచ్‌ చేసి చూడు‌‌పై రవితేజ కాన్ఫీడెన్స్ ఏంటీ..?

ఏడాదికి రెండు, మూడు సినిమాలకు తగ్గకుండా ప్రేక్షకులను పలకరించే మాస్ మహారాజ్ రవితేజ. రెండేళ్ల పాటు వెండితెరకు దూరమయ్యాడు. ఆరోగ్యం బాగోలేదనో.. కథలు నచ్చలేదనో.. లేక మరో కారణమో ఏది ఏమైనప్పటికీ రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ను ఆడియన్స్ మిస్సయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో గతేడాది రాజా ది గ్రేట్ అంటూ తిరిగి తెరపై ప్రత్యక్షమై కావాల్సినంత వినోదాన్ని అందించాడు. ఇక పాత ఫామ్‌ని అందుకునే దిశగా చకచకా సినిమాలను లైన్లో పెట్టేశాడు. విక్రమ్ సిరి అనే కొత్త దర్శకుడితో టచ్ చేసి చూడు‌ను పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేశాడు.

లవ్, యాక్షన్, సెంటిమెంట్‌‌ను మిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన రీసెంట్ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే ఈ సినిమా మాస్ మహరాజ్ పెట్టుకున్న అంచనాలను అందుకుంటుందా అంటూ ఫిలింనగర్‌లో డిష్కసన్ నడుస్తోంది. పాటలు ఏమాత్రం వినసొంపుగా లేవని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు వస్తుండగా.. పాత కథకే కాస్తంత మెరుగులు దిద్ది దానికి ఫ్యామిలీ సెంటిమెంట్‌ను, లవ్ ట్రాక్‌ను.. యాడ్ చేశారని ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ టచ్ చేసి చూడుపై రవితేజ కాన్ఫీడెన్స్‌తో కనిపిస్తున్నాడు. మరి మాస్ మహరాజ్ ఇంతటి ధీమా వెనుక ఉన్న రీజన్ ఎంటో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. కొత్త సంవత్సరాన్ని రవితేజ హిట్‌తో ప్రారంభించాలని ఆశిద్దాం.