English | Telugu
గ్యారేజ్‌ని గాలికొదిలేసిన నిర్మాతలు ...
Updated : Sep 7, 2016
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీసు బెండు తీస్తోంది. అసలే ఎన్నో అంచనాల మధ్య రిలీజైన సినిమా కావడంతో ఎలాగైనా హిట్టవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు ఆశించారు. అయితే మొదటి రోజు పబ్లిక్ టాక్ విని ఎన్టీఆర్ అభిమానులు డీలా పడ్డారు. కానీ మూడు రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి 100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఏ సినిమాలు లేకపోవడం వల్ల 100 కోట్లు ఖచ్చితంగా రాబడుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్న సమయంలో పైరసీ అభిమానులను నిరాశపరుస్తోంది. పైరసీ సైట్లపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ ఇండస్ట్రీ కళ్లుగప్పి పలు సినిమాలు నెట్‌లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. అది గ్యారేజ్ విషయంలోనూ వర్తిస్తోంది. జనతా గ్యారేజ్ రిలీజైన 10 గంటల్లోపే పైరసీ వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని అభిమానులు నిర్మాతల దృష్టికి తీసుకువచ్చినప్పటికి వారు అంతగా స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పైరసీని నియంత్రించే బాధ్యతను జూనియర్ అభిమానులే స్వీకరించి..పైరసీ వెబ్‌సైట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పైరసీని అడ్డుకోగలిగితే గ్యారేజ్ 100 కోట్ల ఫీట్‌ను సాధించడం పెద్ద విషయమేమి కాదు.