English | Telugu

థమన్ మెగాస్టార్ ని మెప్పిస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి కోసం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అష్టకష్టాలు పడుతున్నాడు. అవును.. చిరంజీవికి పాట కొట్టడం అంటే ఆషామాషీ విషయం కాదు కదా. ఆ కష్టం ఎలా వుంటుందో..ఇప్పుడు థమన్ స్వయంగా అనుభవిస్తున్నాడు. బ్రూస్ లీ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ కి చిరంజీవికి ఓ సాంగ్ చేసే అవకాశం దక్కింది. ఆ సాంగ్ కోసం తెగ కష్టపడుతున్నాడట.చిరంజీవి, రామ్ చరణ్, ఇలియానాల మధ్య వచ్చే ఈ సాంగ్ ఏడెనిమిది వెర్షన్లు సిద్ధం చేశాడట. కానీ అవి ఏవి మెగాస్టార్ కి నచ్చడంలేదట. ఆడియో రిలీజ్ డేట్ కూడా త్వరలో ఎనౌన్స్ చేస్తారట. అప్పటిలోపు థమన్ సాంగ్ తో మెగాస్టార్ ని ఇంప్రెస్ చేయకపోతే..వేరే సంగీత దర్శకుడికి ఇవ్వలని ఆలోచిస్తున్నారట. మరి థమన్ అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా లేక చేజార్చుకుంటాడా అనేది వేచి చూడాలి.